కోక తెచ్చిన గొడవ ఆ పోలీసు అధికారి వీఆర్ కి వెళ్లేలా చేసింది.. ఒంటిపై ఖాకీ చొక్కా ఉంటే తన అంతటి వాడు లేడని విర్రవీగే పోలీసులు ఒక్కోసారి చేసే తప్పులు యావత్ పోలీసుశాఖకే చెడ్డపేరు తీసుకువస్తాయి. ఓ మహిళా కానిస్టేబుల్ కోసం ఒక సీఐ, మరో కానిస్టేబుల్ బహిరంగ కొట్టుకోవడం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీస్ స్టేషన్ లో చర్చనీయాంశం అయ్యింది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులే కోక కోసం నడిరోడ్డుపై కొట్టుకోవడం అందరూ వేలెత్తి చూపేలా చేసింది. భీమవరం వన్ టౌన్ పోలీస్టేషన్లో ఓ లేడీ కానిస్టేబుల్ ని రాజేశ్ అనే కానిస్టేబుల్ బైక్ పై లిఫ్ట్ ఇస్తుండటాన్ని సీఐ కృష్ణభగవాన్ చూసి తట్టుకోలేకపోయాడు. దీనితో ఈవిషయమై కానిస్టేబుల్ ని ప్రశ్నించి..అజమాయిషీ చేసే తరుణంలో పర్శనల్ అనే మాట రావడంతో ఆ విషయం కాస్త చినికి చినికి గాలివానగా మారింది. వారిద్దరికీ మధ్య చెలరేగిన వివాదానికి కారణమైంది. ఆపై ఒకరిపై ఒకరు దాడిచేసుకునే వరకు వచ్చింది. జిల్లాలో పోలీసుశాఖ పరువుని తీసిన ఈ ఘటన ఉన్నతాధికారులకు కోపాన్ని తెప్పించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా.. విచారణ చేసిన ఉన్నతాధికారులు సీఐని తప్పుకి పనిష్మెంట్ ఇస్తూ వీఆర్ కు పంపారు. ఆడదాని కోసం రాజ్యాలే పోయాయని పురాణాల్లో చదువున్నకున్నాం..ఒక్క మహిళా కానిస్టేబుల్ కోసం ఒక పోలీసు అధికారి, మరో కానిస్టేబుల్ నడిరోడ్డుపై తన్నకోవడం భీమవరంలోచే చూస్తున్నామంటూ అక్కడవారంతా బహిరంగంగానే పోలీసుల చేసిన ఘటనపై దుమ్మెత్తి పోశారు. ఎంతవారలైనా కాంత దాసులే అనడానికి కోక కోసం పోలీసుల కొట్లాట ఉదాహరణగా చెప్పొచ్చేమో...