ఒంటిపై ఖాకీ చొక్కా.. నెత్తిన టోపీ..చేతిలో లాఠీ ఉంటే చాలు..ఎవర్నైనా ఏంట్రా అని ఎంతో మర్యాదగా పిలుస్తారు పోలీసులు.. పోలీస్ డ్రెస్ వేసుకోకుండా కూడా విధులు నిర్వహించే పోలీసులు నిందితుల కోసం గస్తీలో తిరుగుతున్నామని సమర్ధించుకుంటారు..చట్టం వీరి చుట్టమో ఏమో తెలీదు గానీ.. లా అండ్ ఆర్డర్ ని మొత్తం వీరే తమ బుజాలపై మోసేసి.. హరిశ్చంద్ర వంశానికి చెందిన వారిలా రూల్స్ మాట్లాడేస్తారు.. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐపీఎస్ లు కూడా ఇంతలా ఓవరేక్షన్ చేయరేమో అనిపిస్తుంది.. ఇదంతా సాధారణంగా పోలీసులు చేసే పని..కానీ అనకాపల్లి జిల్లా రావికమతం సర్కిల్ , కొత్తకోట పోలీస్ స్టేషన్ లో ఓ ఏఎస్ఐ ఏకంగా పోలీస్ స్టేషన్ ను బార్ గా మార్చేశాడు.. మందు కొట్టిన తరువాత పొందు లేకపోతే మజా ఏముంటుందని అనుకున్నాడో ఏమో..ఏకంగా ఒక మహిళను కూడా స్టేషన్ కి రప్పించుకున్నాడు. మందేసి..చిందేసి..రాసలీలలు మొదలు పెట్టాడు. ఇలాంటి సమయంలోనైనా చట్టం తన పని తాను చేసుకుపోవాలి కదా.. అంతే ఏఎస్ఐ అప్పారావు చేస్తున్న నిర్వాకాన్ని సిఐకి స్థానికులు సమాచారం అందించారు. రెడ్ హేండెడ్ గా ఏఎస్ఐని పట్టుకొని సిఐ సయ్యద్ ఇలియాస్ మహ్మద్ తీవ్రంగా మందలించి..విషయాన్ని జిల్లా ఎస్పీ ద్రుష్టికి తీసుకెళ్లారు. సిఐ ఈ విషయాన్ని ఎస్పీ ద్రుష్టికి తీసెకెళ్లకపోతే స్థానికులే తీసుకెళ్లేంత పనిచేశారు.
ఒంటిపై ఖాకీ చొక్క వేసుకోగానే మేము ప్రజలందరికీ అతీతులం అన్నట్టు ఒక రేంజ్ లో విర్రవీగిపోయే పోలీసులు ఒక్కోసారి చేసే పనులకు ఈ విధంగానే అదే చట్టానికి దొరకాల్సి వుంటుంది. ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ రాసి కేసు గట్టిపడేలా సెక్షన్లు రాసే పోలీసులు రావికమతం పోలీస్ స్టేషన్ లోనే జరిగిన మందు, పొందు, రాసలీలలాడిన ఏఎస్ఐ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే తప్పుచేసే పోలీసులపైనా కూడా చర్యలు తీసుకుంటామని ఈ విషయంలో ఎవర్నీ ఉపేక్షించేది లేదని సిఐ తెగేసి చెప్పారు. మందుకొట్టిన ఏఎస్ఐ అప్పారావుని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సిఐ వచ్చి ఏఎస్ఐతో మాట్లాడుతున్న సమయంలో ఆశక్తి గట్టాలు రక్తికట్టించాయి..చేసిన తప్పు రుజువవడంతో సిఐ కాళ్లు పట్టుకొని మరీ బ్రతిమలాడాడు ఏఎస్ఐ అంతేగదా మరి.. ఎవడైనా తప్పుకి దొరకనంత వరకే దొరికన తరువాత పోలీసు అధికారులు కూడా హీరోలైపోతారు..అదే తప్పు చేసిన పోలీసోడు..అదే పోలీసు అధికారి కాళ్లు కూడా పట్టుకుంటాడు అనేలా ఏఎస్ఐ సిఐ కాళ్లు పట్టుకున్నాడు. ఇలాంటి వారిని చూసినపుడు గదా పోలీసంటే ఏంటో ప్రజలకి తెలిసేది..నిజంగా వీడేరా పోలీస్ అంటున్నారు విషయం తెలిసిన వారంతా..నిజమేకదా మరి..!