డాక్టర్ అంభేద్కర్ కోనసీమ జిల్లాలోని ఈతకోట గ్రామంలో వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ పై దాడిచేసిన రీజనల్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు 6.315 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేసినట్టు ఇనెస్పెక్టర్ సత్యకిషోర్ తెలియజేశారు. క్రిభ్కో యూరియా గరిష్ట అమ్మకపు ధర రూ 266.50 వుండగా రూ 300/- లకు అమ్మకాలు చేస్తున్నట్టుగా కూడా గుర్తించామన్నారు. సీజ్ చేసిన ఎరువల మొత్తం రూ 69,015/- ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.ఈ దాడుల్లో తహశీల్దార్ విజయ్ కుమార్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.