గంజాయి కారుతో అనకాపల్లి డిఎస్పీ ‘ఢీ’ ఆపై షికారు
Ens Balu
455
anakapalli
2023-02-12 06:46:51
పోలీసోడు ఏం చేసినా అది రైటే.. చట్టాలు మన చేతిలో ఉన్నప్పుడు.. ప్రశ్నించే జిల్లా అధికారులు ఎవరూ లేనపుడు.. చట్టవిరుద్దంగా చేసే పనులకు అడ్డులేనపుడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది.. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా.. ఇదంతా మన అనకాపల్లి డిఎస్పీ సునీల్ యరైటీగా ఉంటదని చేసిన ఘనకార్యం కోసమే.. ఇక వివరాల్లోకి వెళితే.. గత ఏడాది జూలై నెలలో కసింకోట మండలం ఏఎస్ పేట జాతీయ రహదారి వద్ద స్కార్పియో వాహనంలో గంజాయి తరలిస్తూ నిందితులు వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. పోలీసులు స్కార్పియో వాహనంలోని 220 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా రాజస్థాన్ కి చెందిన సింగ్ అనే వ్యక్తి జిమాడుగుల ప్రాంతంలో ఉంటూ గంజా వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సింగ్ను గత ఏడాది నవంబర్లో అరెస్ట్ చేశారు. ఈ సమయంలో ఇతను వచ్చిన షిఫ్ట్ వాహనాన్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు.
అలా ఉంచేస్తే ఏమొస్తిందిలే అనుకొని దానిని తన సొంత పనులకు వాడటం మొదలు పెట్టాడు డిఎస్పీ.. ఆ కారుకు స్మగ్లింగ్ చేస్తూ పట్టిబడిన మరో వాహన నెంబర్ ను తగిలించుకుని మరీ రోడ్లపై తిరుగుతూ. ఇష్టరీతిని వ్యవహరిస్తూ.. రోడ్డుపైనే వెళ్ళే వాహానాన్ని ఢీ కొట్టాడు. సదరు భాదిత వాహనదారుడు ఆ వాహనాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అప్పుడే ఆ దొరగారి దొంగతనం, ఆపై తేడాతనం బయపడింది. చట్టాన్ని..న్యాయాన్ని తమ బుజాలపై మోసేస్తున్నట్టు కలరిచ్చే పోలీసోడు తప్పు చస్తే ఊరుకుంటారా.. విషయాన్ని క్షణాల్లో రాష్ట్రవ్యాప్తం చేసేశారు. గంజాయి కేసులో పట్టుబడ్డ కారుని వినియోగించడం ఒక తప్పు అయితే దానికి వేరే నెంబరు ప్లేటు మార్చి వినియోగించడం మరో పెద్ద తప్పు. చట్టాలు మన చేతిలో ఉన్నప్పుడు.. ప్రశ్నించేవారు ఎవరు అని అనుకున్న అనకాపల్లి డిఎస్పీ వ్యవహారం ఇపుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ అయ్యింది.. చట్టవిరుద్దంగా చేసే పనులకు వాడిన కారులోనే.. షికారు చేసి..తేడా పోలీసోడంటే ఎలా ఉంటాడో లైవ్ లో చూపించాడు. గత్యంతరం లేని జిల్లా పోలీసులు విచారణ చేసి, చర్యలు తీసుకుంటామని చెప్పి చేతులు దులుపుకున్నారు.