విశాఖ పోలీస్ కమిషనర్ దృష్టికి విజెఎఫ్ అక్రమాలు


Ens Balu
160
Visakhapatnam
2023-04-17 17:20:23

విజెఎఫ్(విశాఖ జర్నలిస్టుల ఫోరం)లో అక్రమాలు,(Under Section 23 Of The Andhrapradesh Societies Registration Act-2001)ను తుంగలోకి తొక్కి నిబం ధనలకు విరుద్ధం పరిపాలిస్తున్న పాలకవర్గం అక్రమాలు, అవినీతిపై వెంటనే విచారణ చేయించాలంటూ సీనియర్ జర్నలిస్టులు విశాఖ సిపి డా.త్రివక్రమవర్మ దృష్టికి తీసు కెళ్లారు. సోమవారం రాత్రి ఈమేరకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఫిర్యాదుచేశారు. సుమారు రూ.12కోట్ల మేర నిధులు, విరాళాలు, అనధికారికంగా  చేసి న మొత్తాలపై సొసైటీ యాక్టును అనుసరించి విచారణ చేయాలని కోరారు. ముఖ్యంగా 12ఏళ్లుగా ఎలాంటి ఎన్నికలు లేకుండా కోర్టుకేసుల నెపం చూపి, కనీ సం సొసైటీ ని బంధనల ప్రకారం సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించకుండా అనధికారికంగా పరిపాలన చేస్తున్నారని.. ఇపుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా మెం బర్ షిప్ డ్రైవ్ అక్రమంగా చేపడుతున్నారని సిపికి వివరించారు.