ప్రతిష్టాత్మక వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)లో కాలంచెల్లిన అనధికార కార్యవర్గం చేపడుతున్న వ్యవహారాలపై జిల్లా కలెక్టర్ డా.మల్లిఖా ర్జున నియమించిన త్రిసభ్య కమిటీ గురువారం విచారణ చేపట్టింది. విశాఖలోని డాబాగార్డెన్స్ లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఈమేరకు రికార్డులు పరిశీలన జరిగింది. జిల్లా రిజిస్ట్రార్ ఎంఎస్జీకే.మూర్తి రికార్డులు తనిఖీలు చేశారు. 2012 నుంచి నేటివరకూ సుమారు 11 ఏళ్లపాటు అప్రజా స్వా మికంగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు చేపడుతోంది. అంతేకాకుండా సభ్యులతో ఎలాంటి సర్వసభ్య సమావేశాలు ఏర్పా టు చేయకుండా చట్టవిరుద్ధంగా కార్యక్రమాలు చేశారు. నాటి నుంచి నేటి వరకూ చేపడుతున్న కార్యకలాపాల ఖర్చులు, ఆదాయం, విరాళాల పై వేసిన ప్రశ్నలకు కార్యవర్గం నీళ్లునమిలిందట. దీనితో తొలి విచారణలోనే లెక్కలపై ప్రధానంగా దృష్టి పెట్టి కోశాధికారి, కార్యదర్శిలపైనే విచారణ అంతా సాగింది. ఈలోపులోనే విషయం తెలుసుకున్న ఇతర కార్యవర్గ సభ్యులు పలాయనం చిత్తగించారట.