నాటుసారా తయారుచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ సిఐ పి.అశోక్ హెచ్చరించారు. శుక్ర వారం ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో 200 లీట్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడంతోపాటు, 15 లీటర్ల సారా స్వాధీనం చే సుకున్నామన్నారు. ఈ మేరకు ప్రత్తిపాడులో ఆయన మీడియాకి దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించా రు. కిర్లంపూడి మండ లంలోని ఎస్.తిమ్మాపురం, ఈ గోకవరం గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్టు వివరించారు. అక్కడ గీసాల లోవరాజు, పిచ్చుక సూర్యవతి అ నే మహిళను అరెస్టు చేసి వారి నుంచి సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా నాటు సారా తయారీ, వ్యాపారం, రవాణాకు పాల్పడితే క ఠిన చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామని సిఐ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్ఈబి పి.సునీల్ కుమార్ బృందంతోపాటు, ప్రత్తిపాడు స్టేషన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.