రూ.32లక్షల విలువైన మద్యం స్వాధీనం..


Ens Balu
0
గుంటూరు
2020-11-29 17:14:34

గూంటూరు పోలీసులు ఆదివారం రూ.32 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 19 మందిని అరెస్టు చేయడంతోపాటు, లారీ, జేసిబీలను కూడా సీజ్ చేశారు. ఈ విషయమై గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ మీడియాతో మాట్లాడుతూ, స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరోకి వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి అక్రమ మద్యాన్ని తరలిస్తున్న గ్యాంగ్ ను పట్టుకొని, వారి దగ్గర నుంచి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వివరించారు. పట్టుకున్న మద్యంలో 16,128 బాటిళ్లు కాగా, రూ.35 విలువైన లారీని కూడా సీజ్ చేసినట్టు చెప్పారు. చట్టవ్యతిరేక పనులకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు. అరెస్టు అయినవారిలో గుండ్లపాడు, ఉప్పలపాడు చెందిన వారు 12 మంది కాగా, ఇద్దరు కర్నాటక రాష్ట్రానికి చెందిన వారున్నారన్నారు. భారీ మొత్తంలో అక్రమ మద్యాన్ని పట్టుకున్న ఎస్ఈబీ పోలీసులను ఎస్పీ అభినందించడంతోపాటు వారికి రివార్డులను అందజేశారు. పట్టుకున్న మద్యాన్ని సీజ్ చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ అధికారి ఆరీఫ్ హఫీజ్, ఎక్సైజ్ అదనపు ఎస్పీ చంద్రశేఖరరెడ్డి, ఎస్ఈబి సిఐ వీరేంద్రబాబు, ఎక్సైజు సిఐ కొండా రెడ్డి ఉన్నారు.