విజయనగరంలో సింగం పోలీస్ సీన్ రిపీట్..


Ens Balu
0
Vizianagaram
2020-12-24 21:24:56

సూర్య  అనుష్క  జంటగా నటించిన సింగం-1 సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. అందులో క్లైమాక్స్ లో హోంమినిస్టర్ గారి అమ్మాయిని విలన్ గ్యాంగ్ ట్రైన్ లో కిడ్నప్ చేస్తారు. ఆ విషయం తెలుసుకుని పోలీసు అయిన హీరో, చాలా చాకచక్యంగా వ్యవహరించి, అమ్మాయిని కిడ్నపర్ల చెర నుండి సురక్షితంగా కాపాడతాడు.  అదేసీన్ విజయనగరంలో కూడా రిపీట్ అయ్యింది. విజయనగరం రూరల్ పోలీసులు చాలా చాకచక్యంగా, విజయనగరంలో దొంగతనం చేసి ట్రైన్లో పారిపోతున్న ఒక కిలాడి దొంగని పట్టుకున్నారు. చత్తీస్గఢ్ రాష్ట్రం, దుర్గ్ జిల్లా కి చెందిన తస్విర్ సింగ్ కు ఒక లారీ ఉంది. గంగవరం పోర్ట్ నుండి ఛత్తీస్గఢ్ లో గల రైగఢ్ కు బొగ్గును తీసుకొని రావటానికి, తస్విర్ సింగ్ తన లారీని దీపక్ సాహు అనే వ్యక్తికి ఇచ్చి పంపాడు. గంగవరం పోర్టులో బొగ్గు లోడ్ చేసుకున్న దీపక్ సాహుకి మదిలో దుర్బుద్ధి కలిగి, విజయనగరం జిల్లా లో విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల చెల్లూరు రింగురోడ్డు వద్ద లారీని ఆపి, లారీ కి వేసిన 04 కొత్త టైర్స్ (విలువ సుమారు ఒక లక్ష) ఊడదీసి మరియు డీజిల్ ట్యాంక్ నుండి సుమారు ₹ 10,000/- విలువ గల డీజిల్ ను తీసేసి, లారీని అక్కడే పెట్టి, దొంగిలించిన సొత్తుని సొమ్ము కింద మార్చుకొని దర్జాగా చేసిన దొంగతనం ఎవరికి తెలియదు అనుకోని విజయనగరం రైల్వేస్టేషన్ కి వెళ్లి విశాఖ-కోర్బ ట్రైన్ ఎక్కి ఇంటికి బయదేరాడు. కానీ పధకం పారలేదు. డ్రైవర్ సాహు ఫోన్ ఆఫ్ చెయ్యడంతో లారీ ఓనర్ కి అనుమానం వచ్చి, లారీ కి బిగించిన GPS ద్వారా లారీ ఎక్కడ ఉందొ కనుక్కొని, విజయనగరం రూరల్ పోలీసులకు తస్విర్ సింగ్ ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. వెంటనే స్పందించిన విజయనగరం రూరల్ SIs  నారాయణ మరియు లక్మి ప్రసన్న టీమ్స్ గా ఏర్పడి, ముద్దాయి చత్తీస్గఢ్ వాస్తవ్యుడు కాబట్టి, ఆ సమయములో విజయనగరం నుండి చత్తీస్గఢ్ కు ట్రైన్ ఉండడంతో అనుమానం కలిగి విజయనగరం రైల్వేస్టేషన్ కు వెళ్లి విచారించగా, ముద్దాయి విశాఖ-కోర్బ ట్రైన్ ఎక్కడాని రూడీ చేసుకొని, ట్రైన్ లో TT డ్యూటీ లో ఎవరున్నారో కనుకొన్ని ఆయనకు ముద్దాయి ఫోటో వాట్సాప్ చేసి, ముద్దాయి ట్రైన్లో ప్రయనిస్తున్నాడని నిర్ధారించుకొని, తరువాత స్టేషన్ బొబ్బిలికి విజయనగరం రూరల్ 2nd SI  ప్రసన్న వెళ్ళాడు. ఇంతలో ముద్దాయి తప్పించుకోవటానికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని, RPF SI , బొబ్బిలి SI కు సమాచారం ఇచ్చారు. ట్రైన్ బొబ్బిలికి చేరగానే, అక్కడ సిద్ధంగా ఉన్న బొబ్బిలి SI ముద్దాయిని పట్టుకొని విజయనగరం రూరల్ 2nd SI ప్రసన్నకి అప్పజెప్పారు. కేసు నమోదు చేసి విజయనగరం రూరల్ పోలీసులు, దొంగిలించిన నాలుగు టైర్స్ మరియు డీజిల్ ను రికవరీ చేసి ముద్దాయిని అరెస్ట్ చేశారు. సినీ ఫక్కీలో దొంగను వెంబడించి  పట్టుకున్న విజయనగరం రూరల్ పోలీసుల సామర్ధ్యాన్ని, ధైర్యసాహసలని, సమయస్ఫూర్తిని  పనితీరుని డిజిపి డి. గౌతమ్ సవాంగ్ అభినందించారు..