మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు..


Ens Balu
3
హైదరాబాద్
2021-01-06 12:19:37

టీడీపీ నేత, మాజీ మంత్రి, భూమా అఖిల ప్రియను తెలంగాణ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియను అరెస్ట్ చేసి ఆమె వాహనంలోనే బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న రాత్రి సికింద్రాబాద్ బోయిన్ పల్లి మనోవికాస్ నగర్ లో ఉండే ప్రవీణ్ కుమార్, ఆయన సోదరులు సునీల్ రావు, నవీన్ రావును దుండగులు బలవంతంగా కారులో తీసుకువెళ్లారు. రాయలసీమకు చెందిన ముఠా సభ్యులే ఈ కిడ్నాప్ చేశారని ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీపీ అంజనీ కుమార్ వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు ఇదివరకే అరెస్టు చేసిన పోలీసులు వారు ఇచ్చిన సమాచారంతో మరో 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ సోదరుడు చంద్రహాస్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హఫీజ్‌పేటలోని రూ.100 కోట్ల విలువైన భూమి విషయంలో వచ్చిన గొడవల నేపథ్యంలోనే వీరిని కిడ్నాప్ చేసి బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు భావిస్తున్నారు. భూమా అఖిల ప్రియను ఒక కిడ్నాప్ కేసులలో అరెస్టు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది..