విశాఖ సాగరతీరం పోలీస్ గస్తీమయం..


Ens Balu
3
Beach Road
2021-01-09 20:30:41

విశాఖసాగరతీరంపై నగర పోలీసులు డేగ కన్నువేశారు.. నిత్యం ఇక్కడ గస్తీని ఉంచుతూ ఏదో జరుగుతోందనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్నారు. ముఖ్యంగా యువత బైక్ రైడింగ్ లను అదుపులో పెట్టడానికి, మాదక ద్రవ్యాల అమ్మకాలపై నిఘా ఉంచడానికి, సముద్రంలో పర్యాటకులు అకస్మాత్తుగా మునిగిపోతే కాపాడటానికి, వాహన నిబంధనలు పాటించకపోతే కేసులు పెట్టడానికి, ఈవ్ టీజింగ్ ను అదుపులో ఉంచడానికి అనేక కారణాలకు విశాఖ ఆర్కే బీచ్ కేంద్రబిందువుగా మారడటంతో ఏకం 190 మంది పోలీసులతో సాగరతీరాన్ని జల్లెడ పడుతున్నారు నగర పోలీసులు. అదే సమయంలో బీచ్ వ్యూ అపార్ట్ మెంట్ల పైనా కన్నేస్తున్నారు పోలీసులు. ఎంతో ప్రశాంతంగా వున్న విశాఖలో కొందరు వ్యక్తులు కావాలని చేస్తున్న వ్యవహారాలు, వ్యాపారాలు, మాదక ద్రవ్యాల వినియోగం ఇలా అన్నింటినీ నిరోధించేందుకు సిపి తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా మహిళలు దైర్యంగా పోలీసులను చూస్తూ సాగరతీరంలో దైర్యంగా తిరగ గలుగుతున్నారు. అదేసమయంలో కొందరు పోలీసులను చూస్తూ భయపడి కూడా దూరంగా జరుగుతున్నారు. మొత్తానికి ప్రతీ అరకిలోమీటరుకొక పోలీసు మాత్రం సాగర తీరంలో ఏర్పాటు చేయడంతో పోలీసుశాఖకు ట్రాఫిక్ అతిక్రమణల నుంచి కూడా ఆదాయం చలానాల్ల రూపంలో గట్టిగానే వస్తోంది. ముఖ్యంగా ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో తీసుకున్న ఈ చర్యలు మంచి ఫలితాలను ఇవ్వడంతో ప్రజలు పోలీసుల గస్తీని స్వాగతిస్తున్నారు.