గంజాయి సేవిస్తున్న వ్యక్తులు పట్టివేత..
Ens Balu
2
Visakhapatnam
2021-02-25 21:30:58
ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రాంగణంలో గంజాయి సేవిస్తున్న బయటి వ్యక్తులు నలుగురిని ఏయూ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. వీరిపై పోలీసు వారికి ఫిర్యాదు చేశారు. గురువారం మద్యాహ్నం ఏయూ గోల్డెన్ జూబ్లీ మైదానం ప్రాంగణంలో గంజాయి సేవిస్తున్న నలుగురు యువకులను ఏయూ సెక్యూరిటీ సిబ్బంది దాడిచేసి పట్టుకున్నారు. ఏయూ చీఫ్ సెక్యూరిటీ అధికారి మహ్మద్ ఖాన్ నేతృత్వంలో సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం వర్సిటీలో నిఘా కల్పిస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందితో వర్సిటీ ప్రాంగణంలో నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నారు. ఇటీవల మహ్మద్ ఖాన్ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వర్సిటీ ప్రాంగణాలలో సెక్యూరిటీని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేస్తూ ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనితో వర్సిటీలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించడానికి పూర్తిస్థాయిలో కృషిచేస్తున్నారు. ఈ సందర్భంగా సిఎస్‌ఓ మహ్మద్ ఖాన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ పరిసరాలలో బయటి వ్యక్తుల ప్రవేశాలను, అసాంఘిక కార్యక్రమాలను పూర్తిస్థాయిలో నిలువరించడం జరుగుతోందన్నారు.