విశాఖలో జనసేన అభ్యర్థి మ్రుతి..


Ens Balu
7
Visakhapatnam
2021-03-14 09:28:17

విశాఖ మహానగరపాలక సంస్థ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల నేపథ్యంలో ఆదివరా జనసేన పార్టీకి చెందిన 11వార్డు అభ్యర్ధిని గోనే భారతి గుండె పోటుతో మ్రుతి చెందారు. దీనితో జనసేన పార్టీలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలిసిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తిని చేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ విధమైన వార్త వినడం శోచనీయమని మీడియా ముఖంగా ప్రకటించారు. త్వరలోనే ఈ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించే అవకాశం వుంది. మొత్తం 98 వార్డులున్న జివిఎంసీ మున్సిపల్ కార్పోరేషన్ లో ఇలాంటి ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 14ఏళ్ల తరువాత జరిగిన ఈ ఎన్నికల ఫలితాల్లో పోటీలో ఉన్న అభ్యర్ధిని మ్రుతి రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది..