3ఆస్పత్రులకు రూ.17లక్షలు జరిమానా..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-06-21 15:29:16

విశాఖ నగరంలోని 3 ఆసుపత్రులకు రూ.17 లక్షలు జరిమానా విధించిటన్టు పి.అరుణ్ బాబు తెలిపారు.  సోమవారం నిర్వహించిన డి డి సి (డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ) సమావేశం నిర్వహించి నిబంధనలను ఉల్లంఘించిన ఆసుపత్రులకు జరిమానాలు విధించామని జెసి వివరించారు. అదేవిధంగా ఆయా ఆసుపత్రు లలో నిబంధనలను అతిక్రమించి రోగుల నుండి డబ్బులు వసూలు చేసి నందున వారికి 18 లక్షల వరకూ చెల్లించాలని ఆదేశించినట్లు కూడా తెలిపారు.  పినాకిల్ హాస్పిటల్ కు రూ. 10 లక్షల జరిమానా తో పాటు రోగికి రూ.10 లక్షలు చెల్లించాలని, ఓమ్ని ఆర్కే ఆసుపత్రికి రూ.రెండు లక్షల జరిమానా, రోగికిరూ 4.39 లక్షలు చెల్లించాలని, ఆదిత్య ఆసుపత్రికి 5 లక్షల జరిమానా  రూ. 3.61 లక్షలు రోగికి చెల్లించాలని ఆదేశించడం జరిగిందని వెల్లడించారు.  ఎ.ఎం.జి.రుత్, ప్రథమ, సిద్దార్థ, లేన్ సెట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశామన్నారు. ఈ సమావేశంలో ఆంధ్ర వైద్య కళాశాల డాక్టర్ పి. వి. సుధాకర్, కన్వీనర్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ పాల్గొన్నారు.