ప్రకాశం బ్యారేజీ బాధితురాలికి రూ.5లక్షలు..


Ens Balu
5
Guntur
2021-06-22 14:32:13

ప్రకాశం బ్యారేజి దగ్గర ఘటన జరిగి గుంటూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర హోమ్ మంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. కొద్దిసేపు బాధితురాలి తల్లితో మంత్రిమాట్లాడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.  అనంతరం బాధితురాలి తల్లికి రూ.5 లక్షల చెక్కును అందించారు.  కార్యక్రమంలో  హోమ్ మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా, గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి భాస్కర రెడ్డి, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. ప్రభావతి  పాల్గొన్నారు.