8మంది వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు..


Ens Balu
5
Paderu
2021-06-26 11:43:14

విధినిర్వహణంలో అలక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాల కృష్ణ హెచ్చరించారు. శనివారం ఆసుపత్రిలో విధులకు హాజరు కాని 3 ముగ్గురు వైద్యులకు , ఔషధ నిలువలు వివరాలను నమోదు చేయనందుకు ,ముగ్గురు ఫార్మాసిస్టులకు ,జనన మరణ ధృవీకరణ పత్రాలను జారీచేసే  ఇద్దరు సిబ్బంది కి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ, గిరిజన గ్రామాల్లో వైద్యలు అందించడం ఒక వరంగా భావించాలన్నారు. అంతే తప్పా సేవలు అందించడం భారం అనుకోకూడదన్నారు.  పిఓ వెంట అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లీలాప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణా రావు పాల్గొన్నారు.