ఇద్దరు ఉద్యోగులపై చర్యకు సిఫారసు..


Ens Balu
5
Simhachalam
2021-07-04 12:50:26

సింహాచలం శ్రీశ్రీశ్రీ  శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) స్వామివారి దేవస్థానంలో వీడియో మార్ఫింగ్ చేసిన ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకునేందు కమిషనర్ కి సిఫారసు చేసినట్టు ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఆదివారం దేవస్థానంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇటీవలే వచ్చిన  మార్ఫింగ్ వీడియోలపై అంతర్గత విచారణ జరిపి ఇద్దర్ని బాధ్యులుగా గుర్తించినట్టు వివరించారు. అయితే అందులో ఒకరు చేసిన తప్పుని ఒప్పుకున్నారని, దీనితో సైబర్ క్రైం వరకూ ఫిర్యాదు చేయలేదన్నారు. స్వామివారి దేవస్థానం వీడియోలు మార్ఫిం గ్ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. దేవస్థానం ప్రతిష్టకు భంగం వాటిల్లితే ఎవరినీ క్షమించేది లేదని హెచ్చరించారు. అయితే ఈ ఘటనపై ప్రధాచాన ఆచార్యులు కమిషనర్ తో మాట్లాడారాని ఈఓ వివరించారు. ప్రోటోకాల్ పై నిబంధనలు తయారు చేస్తున్నామని దానిలో కొంత స్పష్టత రావాల్సి వుందన్నారు. రాష్ట్రంలోనే ప్రముఖ దేవస్థానంగా వున్న  శ్రీశ్రీశ్రీ  శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) స్వామివారి దేవస్థానాకి సంబంధించిన ఏ నకిలీ వీడియోను నమ్మొద్దని ముఖ్యంగా వైరల్ చేయవద్దని ఈఓ కోరారు. ఇటు మీడియాగానీ, అధికారులు స్వామి ఆలయానికి చెందిన సమాచారం నేరుగా ఇస్తున్నామని వివరించారు.