రూ.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం..


Ens Balu
4
Kakinada
2021-10-03 08:17:54

గుట్టుచప్పుడు కాకుండా బోర్ డ్రిల్లింగ్ వాహనంలో తరలిస్తున్న వెయ్యికిలోల గంజాయిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. బోర్లు తవ్వే మిషన్ కంటేనర్ లో లోన మిషన్ తీసేసి అందులో గంజాయిని మూటలుగా కట్టి తరలిస్తుండగా సమాచారం అందుకున్న  స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్రుందం దానిని పట్టుకుందన్నారు. ఈ గంజాయి విలువ సుమారు రూ.50లక్షలు వరకూ వుంటుందని ఎస్పీ తెలియజేశారు. ఎస్పీ మాట్లాడుతూ, అక్రమార్కులు గంజాయి, గుట్కా, నాటుసారా ఏ రూపంలో తరలించడానికి ప్రయత్నించా జిల్లాలో వీలుపడదన్నారు. అన్ని చోట్లా భద్రతను, నిఘాను కట్టుదిట్టం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్  బ్యూరో బ్రుందం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.