తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అకౌంటెన్సీ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తూ సీఈఏ పేరుతో సరికొత్త గ్రూపును అందుబాటులోకి తీసుకురానుంది. ఇంటర్ తరువాత నేరుగా సీఏ కోర్సులు చదువుకునేందుకు వీలుగా ఈ గ్రూపును రూపొందించారు. ఈ గ్రూపులో అకౌంటెన్సీతో పాటు కామర్స్, ఆర్థిక శాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ గ్రూపును ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ స్థాయిలోనే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేలా ఈ గ్రూపును రూపొందిస్తున్నామని బోర్డు అధికారులు చెబుతున్నారు. తద్వారా సీఏ కోర్సుకి పోటీ పెరుగుతుంది.