పకడ్బందీగా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్
Ens Balu
32
Visakhapatnam
2023-02-14 10:45:51
విశాఖపట్నం జిల్లాలో ఈ నెల 26 నుండి జరుగనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని డిఆర్ ఓ శ్రీనివాసమూర్తి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. పరీక్షలు జరుగు రోజులలో విద్యుత్ కి అంతరాయం లేకుండా చూడాలని ఏపిఈపీడిసిఎల్ అధికారులకు తెలిపారు . ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్లు ఏర్పాటుకు వైద్యాధికారులకు ఆదేశించారు . మంచినీటి సదుపాయం, శానిటేషన్ పనులు జీవీఎంసీ అధికారులకు ఆదేశించారు. అందరు అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు.
రీజినల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఉమా రాణి మాట్లాడుతూ ఈ నెల తేది 26-02-2023 నుండి 07-03-2023 వరకు ఇంటర్మీడియట్ జనరల్ కోర్సెస్, తేది. 20-02-2023 నుండి 07-03-2023 వరకు ఉదయం 9:00 AM నుండి 12:00 PM వరకు, మధ్యాహ్నం 2:00 PM నుండి 5:00 P M వరకు ఒకేషనల్ కోర్సెస్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష 15.02.23 ( బుధవారం) 10:00 AM నుండి 1:00 PM వరకు , ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష 17.02.23 ( శుక్రవారం) 10:00 AM నుండి 1:00 PM వరకు జరుగునని మొత్తం 126 సెంటర్స్ లో నిర్వహిస్తామని తెలిపారు. సంబంధిత అధికారులు సహాయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఐ ఈ ఓ లు, జీవీఎంసీ, వైద్య, ఆర్టీసీ , ఏపీఈపిడిసిఇఎల్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.