క్రెడిట్ కోర్సుగా ఐపిఆర్..
Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2021-03-15 17:14:39
ఆంధ్రవిశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో బిఇ, బిటెక్ విద్యార్థులకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్(ఐపిఆర్)ను క్రెడిట్‌కోర్సుగా నిర్వహించనున్నారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి దీనిని విద్యార్థులకు క్రెడిట్ కోర్సుగా అందించాలని ఏయూ ప్రతిపాదించింది. ఏయూ ప్రతిపాదనను ఉన్నత విద్యా మండలి అమోదం తెలిపింది. ఈ సదర్భంగా ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులను ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ నుంచి ఐపిఆర్ చెయిర్ ప్రొఫెసర్ డాక్టర్ హెచ్.పురుషోత్తం స్వీకరించారు. ఐపిఆర్ కోర్సును క్రెడిట్ కోర్సుగా అమలు చేయడానికి ఉన్నత విద్యామండలి ఆమోదం తెలపడం పట్ల వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కోర్సును అందిస్తున్న తొలి విశ్వవిద్యాలయంగా ఏయూ నిలుస్తుందన్నారు. నూతన విద్యా విధానం 2020లో భాగంగా నైపుణ్యాభివృద్ధికి ఈ కోర్సులు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు.