ఏకలవ్యలో మిగులు సీట్ల బర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..


Ens Balu
1
Parvathipuram
2021-05-31 10:50:12

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాటశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు   పార్వతీపురం ఐ.టి.డి.ఎ పీఓ ఆర్ కూర్మనాథ్ పేర్కొన్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు 6వ తరగతి ప్రవేశానికి, 7,8 తరగతులలో మిగిలి ఉన్న  సీట్లకుగాను అన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. 4ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాటశాలల్లో 6వ తరగతి బాలికలకు 30, బాలురకు 30 ప్రవేశం కల్పించనున్నట్లు, 7 తరగతిలో బాలురు 6, బాలికలు 22 ఖాళీలు, 8 వ తరగతిలో బాలురు 44, బాలికలు 37 భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలన్నారు.  జూన్,18 ఉదయ 11 గంటలకు ఐ.టి.డి. ఎ కార్యాలయ ఆవరణలో గల గిరిమిత్ర సమావేశ మందిరంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామన్నారు. 6వ తరగతి ప్రవేశానికి అంతకు ముందు తరగతులు 2020-21 విద్యా సంవత్సరం ఉత్తీర్ణత పొందిన తెలుగు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.  ఎస్.టి, ఎస్.సి, బి.సి కులాలకు చెందిన విద్యార్థులు విజయనగరం జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2020-21 విద్యా సంవత్సరంలో 5 వ తరగతి ఉత్తర్ణులై, తల్లిదండ్రులు, సంరక్షకులు వార్షిక ఆదాయ లక్ష రూపాయలు మించి ఉండరాదు. ఇతర వివరములు, దరఖాస్తు నిమిత్తం   www.aptwgurukulam.ap.gov.in వెబ్ సైట్ పరిశీలించి,  సమాచార పత్రంలో ఇవ్వబడిన  ఆర్హతలు పరిశీలించుకుని వెబ్ సైట్లో దరఖాస్తు సమర్పించాలి, దరఖాస్తు చేసుకొనుటకు   జూన్ 16 ఆఖరి తేదీ, ఇతర వివరముల కొరకు మీకు సమీపంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో సంప్రదించాలని ప్రాజెక్ట్ అధికారి పేర్కొన్నారు.