మహిళలకు డిజిటల్ లిటరసీ శిక్షణ..
Ens Balu
3
Vizianagaram
2021-07-15 14:29:09
విజయనగరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఈ- గవర్నెన్స్ పై అవగాహన కల్పించడానికి భారత ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధాన మంత్రి డిజిటల్ సక్షరత అభియాన్ పధకం క్రింద డిజిటల్ లిటరసీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు. దేశ వ్యాప్తంగా 2017 నుండి అమలు చేస్తున్న ఈ కార్యక్రమం లో 58,129 మంది శిక్షణ పొందారన్నారు. విజయనగరం జిల్లాలో ఈ అక్టోబర్ నాటికీ 2 లక్షల 76 వేల 300 మందికి ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ శిక్షణ కోసం స్వయం సహాయక సంఘాల సభ్యులను కామన్ సర్వీస్ కేంద్రాల్లో నమోదు చేయించాలని అన్నారు. అన్ని గ్రామ పంచాయతిలలో ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభించాలన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేని డ్వాక్రా సంఘాల సభ్యులకు ఈ శిక్షణా కార్యక్రమం బ్యాంకింగ్ సేవలలో ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు. ఈ సమావేశం లో డి.ఆర్.డి.ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ సునీల్ రాజ్ కుమార్, మెప్మా పి.డి. సుధాకర రావు, సి.పి.ఓ విజయలక్ష్మి , సి.ఎస్.సి జిల్లా మేనేజర్ అర్చన, రాష్ట్ర ప్రతినిధి శేషగిరి తదితరులు పాల్గొన్నారు.