ఎంఎస్ఎంఇ లో డిప్లమా కోర్సులు..
Ens Balu
1
శ్రీకాకుళం
2021-08-09 13:43:12
విశాఖపట్నం ఎంఎస్ఎంఇ టెక్నాలజీ కేంద్రంలో అడ్వాన్స్ డు డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నామని టెక్నాలజీ కేంద్రం డిప్యూటీ జనరల్ మేనేజర్ జి.ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీ చేస్తూ అచ్చుతాపురం ఎస్ సి జెడ్ లో 20 ఎకరాల స్థలంలో ఎం.ఎస్.ఎం.ఇ టెక్నాలజీ కేంద్రం నెలకొల్పడం జరిగిందని, ఉన్నత అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంజనీరింగ్, సాంకేతిక విద్యను అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఏఐసిటిఇ అనుమతించిన అడ్వాన్స్ డు డిప్లొమా ఇన్ డై అండ్ మౌల్డ్ మేకింగ్ (ఏడిఎంఎం), అడ్వాన్స్ డు డిప్లొమా ఇన్ మెకట్రానిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ (ఏడిఎంఐఎ) కోర్సులను 2021 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ కోర్సులను అందిస్తున్నామని ఆయన చెప్పారు. రెండు కోర్సులలో ఏడిఎంఎం కోర్స్ నాలుగు సంవత్సరాల వ్యవధి, ఏడిఎంఐఎ కోర్సు మూడు సంవత్సరాల వ్యవధి కలిగి ఉందని ఆయన తెలిపారు. ఈ కోర్సులకు పదవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని, ఈ కోర్సులకు మంచి డిమాండ్ ఉండటం కాకుండా నూటికి నూరు శాతం ప్లేస్మెంట్స్ సహాయం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కోర్సుల వివరాలకు ఎం.కాలేబు 9949319237, కే.రాజేష్ 9515397553 ఫోన్ నెంబర్లకు సంప్రదించి తెలుసుకోవచ్చుని ఆయన వివరించారు.