పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీఎస్ఆర్ కింద దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేయనుందని ఆర్టి ఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్కో) అధికారి జయచంద్ర తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన రాజమహేంద్రవరంలో ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు చక్రాల సైకిళ్లు, రోలర్స్ , అందుల చేతికర్ర ఎలా కృత్రిమ అవయవాలు, డైసీ ప్లేయర్ వంటివి పొందేందుకు ఈనెల 29 వ తేదీ రాజామహేంద్రవరం రూరల్ ఎంపీడీవో కార్యాలయంలోనూ, 30 వ తేదీ కొవ్వూరు ఎంపీడీవో కార్యాలయంలోనూ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ శిబిరాలు ఆయా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు పని చేస్తాయన్నారు. ఉచిత ఉపకరణాల కోసం పేర్ల నమోదుకు సదరం సర్టిఫికెట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలు, ఫోన్ నంబర్ తీసుకొని రావాలని జయచంద్ర తెలిపారు. సమాచారం కోసం 040-27891463 ఫోన్ నంబరు ను సంప్రదించవచ్చన్నారు.