ఆ రక్తదాత, శంఖవరం గ్రామ సచివాలయ సర్వేయర్ వీర్ల సురేష్ ఎప్పుడు తన రక్తాన్ని దానం చేసినా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికే చేస్తారు..అందునా ఈసారి నిండు గర్భిణికి ప్రాణాపాయ స్థితి అని కబురు తెలిసిన వెంటనే గురువారం అన్నవరం నుంచి కాకినాడ జిజిహెచ్ కి వెళ్లిమరీ రక్తాన్ని దానంచేసి వచ్చారు. ఇప్పటి వరకూ 20సార్లు తన రక్తాన్ని దానం చేసిన సురేష్ ఈసారి తన రక్తదానం జీవితంలో గుర్తుండిపోతుందని చెప్పాడు. తన తండ్రి వరహాలబాబు స్వర్గస్తులైన రోజు ఆపద సమయంలో ఉన్న గర్భిణికి రక్తం దానం చేసే అవకాశం వచ్చిందని అన్నాడు. ప్రతీ 3నెలలకు ఒకసారి తాను రక్తం దానం చేస్తున్నానని అన్నారు. మనం చేసే రక్తం దానం వలన ఎనిమిది మంది ఆరోగ్యాలను కాపాడటానికి అవకాశం వుంటుందని, అంతేకాకుండా శరీరంలోకి కొత్తరక్తం కూడా చేరుతుందన్నారు. ఈ క్రమంలో తాను ఇచ్చే రక్తదానంతో చాలామంది స్పూర్తి పొందుతుండటం కూడా తనకు అసలైన సంతృప్తిని కలిగిస్తుందన్నని సురేష్ చెప్పారు.