ఉరుకుల పరుగుల జీవనం..క్షణం తీరిక దొరకని వైనం..అయినా ఆగదు ఆయన నిరంతర సేవాయానం.. అది విపత్తు అయినా..సాధారణ కష్టమైనా.. మరేదైనా.. ఐదు రూపాయల సహాయం చేసి.. 50 రూపాయాల ప్రచారం పొందే ఈరోజుల్లో..నిశ్వార్ధంగా సేవలందిస్తూ.. నా అన్నవారికి ఆపన్న హస్తం అందించే వ్యక్తి గంట్ల శ్రీనుబాబు.. జర్నలిస్టుగా.. జర్నలిస్టు సంఘ జాతీయ నాయకుడిగా..సేవకుడిగా నిరంతరం ప్రజాసేవలోనే ఇమిడిపోతూ..ఎవరినైనా నా తమ్ముడూ, నా అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ వ్యక్తికోసం రాసే ఏ వార్తయినా తడుముకోకుండానే పదాల పదనిసలు పత్రికపై నాట్యం చేస్తాయి. పేరుకోసం చేసే సహాయం అంటే చాలా మంది దాతలు ముందుకొస్తారు..కానీ గంట్లశ్రీనుబాబు చేసే సహాయం తెలిస్తే..ఎలాంటి వారైనా సహాయాన్ని తమ జీవితంతో ఒక భాగంగా చేసుకుంటారు. ఎవరైనా మ్రుతిచెందితే ప్రభుత్వం కూడా మట్టిఖర్చులు ఇవ్వడానికి వారం రోజులు సమయం తీసుకుంటుంది. కానీ ఈయన మాత్రం ముందుగా దహన సంస్కార కార్యక్రమాల్లో పాల్గొని ఆఖరి మజిలీ ర్యాలీ నిర్వహించి..ఆ కుటుంబానికి మట్టిఖర్చులు ఇచ్చి తన వంతు బాధ్యతను సేవగానే చేస్తారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఈయన చేసిన సేవా కార్యక్రమాలు ఈ వార్తలో చెప్పాలంటే పెన్నులో సిరా చుక్కలు ఇంకిపోవాల్సిందే. అలాంటి సేవా మూర్తి 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ పండుగ రోజున సేవామూర్తి అవార్డు తీసుకోవడం ఆయనకే కాదు.. యావత్ జర్నలిస్టులకే గర్వకారణంగా చెప్పాలి. ఆయనకి ఏ అవార్డు, ఏ కీర్తి లభిచించినా దానాని జర్నలిస్టుల కుటుంబాలకు అంకితం ఇచ్చే మంచి మనసున్న దాత శ్రీనుబాబు. ఎల్లప్పుడూ జర్నలిస్టుల సంక్షేమం, వారి అభివ్రుద్ధి.. నిరుపేదలకు సహాయం అందించాలనే మంచి ఆలోచనతో ముందుకి సాగే గంట్ల శ్రీనుబాబు రానున్న రోజుల్లో ఆయన సేవను మరింత మందికి విస్తరించాలని..మరెందరికో స్పూర్తిగా నిలివాలని..ఇంకెన్నో అవార్డులు స్వీకరించాలని మనమంతా కోరుకుందాం..!