యువతపై సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ ఎఫెక్ట్


Ens Balu
52
Visakhapatnam
2022-12-09 06:10:24

ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ నిర్వహిస్తున్న పోలీసు ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆలోచింపజేస్తున్నది. ప్రభుత్వం సుమారు ఆరువేలకు పైగా పోలీసుశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేస్తే.. ఆఉద్యోగాలకు సిద్ధమయ్యేవారికి జెడీ ఫౌండేషన్, మరియు మరో ప్రైవేటు కోచింగ్  సెంటర్ సహకారంతో నిర్వహించున్నన్న ఉచిత శిక్షణా కార్యక్రమం రాష్ట్రంలో వైరల్ అవుతుంది. రాష్ట్రప్రభుత్వం అదీనం ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిరుద్యోగల కోసం ఉచిత కోచింగ్ నిర్వహించలేదు. అలాంటి సమయంలో  సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ ఐపీఎస్ కూడా కావడంతో పోలీసు ఉద్యోగాలకు సిద్దమయ్యేవారికోసం ఉచితంగా వెయ్యిమందికి ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తానని ముందుకి వచ్చారు. ఎలాంటి మీడియా ప్రకటన లేకుండా కేవలం సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసిన వీడియో ప్రచారానికే వేల సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్క్రీనింగ్ సెంటర్లను 
ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఎంపిక అయిన వారికి పోలీసు ఉద్యోగాలకు ఉచితంగానే కోచింగ్ ఇవ్వనున్నారు.

ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు పడ్డ గండి
 సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ నిర్వహించ తలపెట్టిన ఉచిత కోచింగ్ కారణంగా రాష్ట్రంలో ప్రధానంగా పోలీస్ ఉద్యోగాలకే శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లకు గండి పడే ప్రమాదం ప్రస్తుతం ఈ ప్రకటన వస్తున్న స్పందన ద్వారా కనిపిస్తున్నది. ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ రెండింటిలోనూ ఈ ఉచిత కోచింగ్ ఇస్తామని ప్రకటించడంతో ఆశావాదులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. అంతేకాదు ఈసమయంలో పలు ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో చేరుదామనుకుంటున్న వారికి, కోచింగ్ సెంటర్లకు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం గండి కొట్టినట్టు అయ్యింది. అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయపార్టీలు 
చేయలేని కార్యక్రమాన్ని ఒక సామాజిక భాద్యతలో చేపడుతున్న  లక్ష్మీనారాయణ పట్ల యువతలో మరింత గౌరవ భావం పెరుగుతున్నది. 

అనూహ్య స్పందన, నిరుపేదలే ఎక్కువ
ఏపీలో పోలీస్ ఉద్యోగాలకు పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్ పడటంతో అత్యధిక మంది నిరుపేదలు, నిరుద్యోగులు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో  సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అందించే ఈ ఉచిత కోచింగ్ కూ పెద్ద సంఖ్యలో ఆదరణ లభిస్తున్నది. ఇప్పటికే సదరు సంస్థ విడుదల 
చేసిన యూట్యూబ్ ఛానల్ ను కూడా పోలీస్ ఉద్యోగాలకు పోటీపడుతున్న అభ్యర్ధులు, susbscribe చేసుకోవడంతోపాటు, ఎంట్రన్స్ టెస్టుకి కి దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం తరపున ఎలాంటి శిక్షణా కార్యక్రమం లేకపోవడం, బయట కోచింగ్ సెంటర్లలో పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండటంతో 
ప్రస్తుతం ప్రకటించిన జెడీ ఫౌండేషన్ ఉచిత పోలీసు పోటీ పరీక్షల ఉచిత శిక్షణ వెల్లువలా దరఖాస్తులు వస్తున్నాయి. చూడాలి రాష్ట్రవ్యాప్తం వెయ్యింది మందికి  నిర్వహించే ఈ కోచింగ్ కు ఎన్ని వేల మంది దరఖాస్తులు చేసుకొని, ఎంట్రన్సు పరీక్షలో పోటీ పడతారో..మరెంత మంది ఆ శిక్షణ ద్వారా ఉద్యోగాలు సాధిస్తారో..!