కన్నీటిబొట్టు నేలరాలింది.. ద్రవించిన నిండు హృదయం పాడేమోసింది..!


Ens Balu
500
undefined
2023-03-09 04:00:42

నిన్నమొన్నటి వరకూ కలిసి తిరిగిన వీడియో జర్నలిస్టు చిన్నా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రాణం పోయింది. పోషణ మొత్తం అతనేకావడంతో పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం రోడ్డున పడి చేసినరోధన ప్రతీ ఒక్క జర్నలిస్టునూ కదిలించింది. చేయి చేయికలిపిన కలం కార్మికుల విషణ్ణ వదనాలమధ్య అంతిమయాత్రతో చిన్నాకు చివరి వీడ్కోలుపలికారు. కన్నీటిబొట్టు నేలరాలుతూనే ద్రవించిన హృదయంలో విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పాడేమోశాడు..ఇష్ట కాలంలోనే కాదు కష్టంలోనూ ముందుకొచ్చి రూ.50వేలు ఆర్ధిక సహాయం అందించి ఆ కుటుంబాన్నిఆదుకున్నారు. అంతేకాకుండా ఎప్పుడు ఏకష్టమొచ్చినా నేనున్నానని మరిచిపోవద్దంటూ కొండంత భరోసా ఇచ్చారు. గంట్ల సహాయంతో ముందుకొచ్చిన జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు వారికి తోచిన సహాయం చేసి చిన్నా కుటుంబానికి చేయూతనందించారు.