వాసుపల్లి చొరవతో ఆ చిన్నారికి ఓపెన్ హార్ట్ సర్జరీ..


Ens Balu
0
Visakhapatnam
2020-12-24 17:25:29

విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చొరవతో 39వ వార్డుకి చెందిన వంకా నాగమణి కుమారుడు నూకరాజుకి ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. రేషన్ కార్డులో తన కుమారుడి పేరులేకపోయినా ఉచితంగా ఆపరేషన్ చేయించి తన కొడుకు ప్రాణాలు నిలబెట్టిన దేవుడు ఎమ్మెల్యే అంటూ తల్లి నాగమణి   కృతజ్ఞతలు తెలియజేసింది. గురువారం ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకొచ్చి తన కుమారుడిని వాసుపల్లికి చూపించారు. దీనితో త్వరగా కోలుకొని, ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని ఎమ్మెల్యే ఆ కుర్రాడిని దీవించారు. అంతేకాకుండా మందుల కోసం మూడు వేల రూపాయలు ఆర్ధిక సహాయం కూడా చేశారు. మీ దయవల్లే ఈరోజు నా బిడ్డ మా కళ్లముందు తిరగలుగుతున్నాడంటూ తల్లిఆనందంతో కన్నీటి పర్యంత అయ్యింది. వాసుపల్లి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని నిరుపేదలందరికీ తాను అండగా ఉంటానని ఎప్పుడూ అదైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో 39వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం,TLF లీడర్ బేహారా వెంకటరత్నం, మాజీ యూత్ ప్రెసిడెంట్ విళ్లూరి భాస్కర రావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.