నిజమైన స్నేహానికి నిలువుట్టదం ఆమె..
Ens Balu
13
Visakhapatnam
2021-01-30 22:14:37
అవును స్నేహమంటే టిప్పుటాపుగా కలిసి తిరుగుతూ జీవితాన్ని సరదాగా గడపటం కాదు..తన అనుకునే స్నేహితులు కష్టకాలంలో ఉంటే నేనున్నానని చేయూత నిచ్చి సాయమందించి దైర్యం చెప్పడమే నిజమైన స్నేహమంటే. నా జీవితంలో సగ భాగం నా భర్త..అలాంటి భర్తకు ప్రాణాలమీదకు వచ్చినపుడు నా స్నేహితురాలే నాకు అండగా నిలిచింది. నీకేం భయంలేదు బావగారు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తారని దైర్యం చెప్పి..కొండంత అండగా నిలిచి నాకు ఎంతగానో దైర్యం చెప్పిన నా చెల్లి కోలా జయలక్ష్మి సేవను, సహాయాన్ని నేను ఎప్పుడూ మరిచిపోలేన చెబుతున్నారు బిసి సంఘం యువజన విభాగం మహిళా అధ్యక్షురాలు ధనుకోటి రమ. మంచివారి సేవలు, చేసిన మేలు పది మందికీ తెలిస్తేనే దానికి న్యాయంజరిగిందని భావించి నా జీవితంలో తను చేసిన మేలును ఈ విధంగా గుర్తుచేసుకుంటున్నానని మీడియాతో చెప్పారు రమ. ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మథర్ తెరిస్సా మాటలను ఆదర్శంగా తీసుకొని సేవచేస్తూ సహాయ మందించే జయ కోసం నా హ్రుదయంలో నుంచి వస్తున్న ఆనంద బాష్పాలనే మాటలుగా చెబుతున్నాను అనుకోవచ్చు మీరు.. సరదాగా కలిసి తిరగడానికి, డబ్బులు ఖర్చుచేయడానికి ఈరోజుల్లో చాలా మందే ఉంటారు. కానీ ఆర్ధిక పరమైన సాయం చేయడానికి ఎవరూ ముందుకి రారు. మాట సహాయమే కాదు, చేతల్లో కూడా తాను తనకి చేసిన మేలు మాట్లల్లో చెప్పలేనిది అన్నారు. జనవరి 31 కోలా జయ పుట్టిన రోజు సందర్భంగా ఆమె చేసే సేవలను, సహాయాన్ని చెప్పడానికి నాకు మాటలు కూడా రావడం లేదని, నిజంగా అలాంటి చెల్లెలని తనకు ఆ సింహాద్రి అప్పన్నే ప్రసాదించారని ఆనందపరవసం చెందారు. తన భర్తకు సీరియస్ చేసిన సమయంలో తన ఇద్దరు పిల్లలను తన సొంతపిల్లలుగా చేరదీసి, రాత్రనక, పగలనక నాతో ఆసుపత్రుల వెంట తిరుగుతూ నాకు జయ అందించిన సహాయం మరువలేనిదని చెప్పారు రమ. చేయని సేవలకు గొప్పగా చెప్పుకునే ఈరోజుల్లో తన పుట్టిన రోజు సందర్భంగా నాజీవిత భాగస్వామి విషయంలో తాను చేసిన సహాయం నిజంగా ఆ దేవుడే ఆమెతో చేయించాడని నమ్ముతానని కన్నీటి పర్యంతం అయ్యారు. విశాఖజిల్లాలో బిసి సంఘం మహిళా యువజన విభాగం కార్యదర్శిగా తాను చేస్తున్నసేవలు ఆమెను ఎంతో ఎత్తుకి తీసుకెళ్లాయని, ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలనే మంచి మాటను జయ ఎప్పుడూ పాటిస్తారని చెప్పారు. ముఖ్యంగా ఆర్.క్రిష్ణయ్య మార్గదర్శకంలో ఆమె చేస్తున్న కార్యక్రమాలు యువజన విభాగానికే వన్నె తెస్తున్నాయన్నారు. ఒక్క తన విషయంలోనే కదాని ఎప్పుడు, ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా జయ ముందుంటి నడిపించే విధానం, తీరు యువజన విభాగానికే ఆదర్శంగా నిలుస్తాయని చెప్పుకొచ్చారు. అలాంటి మంచి మనిషి పుట్టిన రోజు సందర్భంగా ఆమె స్నేహానికి, తనకు ఇచ్చిన విలువను చెప్పాలనే ఇదాంతా చెప్పానని చెప్పారు రమ. నిజమే గోరంత చేసి కొండంత గొప్పలకి పోయే వారున్న ఈ రోజుల్లో, ఎలాంటి లాభాపేక్ష లేకుండా తనవంతుగా నిండైన సేవ, సహాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న కోలా జయలక్ష్మి తన సేవలను మరింతగా విస్తరించాలని మనమూ కోరుకుందాం..!