మదురాన్నం మహత్తరమైన సేవ..


Ens Balu
15
Guntur
2021-07-04 14:27:51

రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి , గుంటూరు జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు స్వచ్చందగా మదురాన్నం సోసైటీ  ద్వారా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి ప్రతిరోజు వస్తున్న  రోగుల సహాయకులకు రెండు పూటల ఉచితంగా  బోజనం అందించటం ఎంతో గొప్ప కార్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పెర్కొన్నారు. ఆదివారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి  ఆవరణలో   మధురాన్నం సోసైటీ ఆధ్వర్యంలో  రోగుల సహాయకుల కొరకు ఉచిత బోజనం సదుపాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర గృహనిర్మాణశాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తో కలసి పాల్గొన్నారు. భోజన సదుపాయం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, భోజనశాలను, వంటశాలను రిబ్బన్ కత్తిరించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర గృహనిర్మాణశాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. భోజనశాలలో, వంటశాలలో ఏర్పాట్లను మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వివరించారు. ఈ సంధర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు గుంటూరు జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి వస్తున్న రోగుల సహయకులు భోజనం కోసం పడుతున్న  ఇబ్బందులను స్వయంగా చూసి మధురాన్నం సోసైటీ ద్వారా పూర్తి ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారన్నారు.  ఏపీఎన్జీవో సంఘం వారు రోగుల సహాయకుల వసతి కోసం ఏర్పాటు చేసిన భవనంను ఉచిత భోజనం వంటి  ఒక మంచి సత్కార్యం కోసం అందించినందుకు అబినందిస్తున్నామన్నారు. తిరుమల తరహాలో ఆధునిక యంత్రపరికరాలతో ఇక్కడే భోజనంను తయారు చేసి పరిశుభ్ర వాతవరణంలో వేడివేడిగా ఇంటి తరహా భోజనంను రోగులకు అందించేలా భోజనశాలను తీర్చిదిద్దారన్నారు. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు ఇక్కడే కాకుండా వారి సొంత జిల్లా పశ్చిమ గోదావరిలోను ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అన్ని సేవలు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం కోసం ఎక్కువ మంది పేదలు వస్తుంటారని వారి సహాయకులకు భోజనం సదుపాయం కల్పించేందుకు చారిటీలు,ట్రస్ట్లు ముందుకు రావాలన్నారు. ఆకలితో ఉన్న వచ్చిన వారికి అన్నం పెట్టడం భారతీయ సంప్రదాయంలో భాగం అన్నారు.  ఉచిత భోజన సదుపాయం ఏర్పాటుకు సహాకారం అందించిన వారికి, ఏపీఎన్జీవో సంఘం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. 

ఏపీఎన్జీవో సంఘంకు నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ రోగుల సహాయకుల వసతి కోసం జిల్లాలోని ఉద్యోగుల ఆర్ధిక సహాకారంతో రూ.40 లక్షలతో భవనంను నిర్మించటం జరిగిందన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు మంచి సంకల్పంతో రోగుల సహాయకులకు ఉచిత భోజనం అందిస్తున్నందున ఏపీఎన్జీవో సంఘం తరుపున హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. ఉద్యోగులు పీఆర్సీలు, డీఏల కోసం కాకుండా సమాజ హితం కోసం కార్యక్రమాలు చేపడుతుందన్నారు.  
రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు రోగుల సహాయకులకు మధురాన్నం సోసైటీ ద్వారా  ఉచిత భోజనం సదుపాయం కల్పించినందుకు అబినందిస్తున్నామన్నారు. లాక్డౌన్ సమయంలో రోగులతో పాటు వచ్చిన సహాయకులకు కనీస ఆహారం అందటం లేదని స్వయంగా చూసిన మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఏపీఎన్జీవో సంఘం వారు రోగుల సహాయకుల విశ్రాంతి కోసం నిర్మించిన భవనంను ఉచిత బోజనం అందించేందుకు భోజనశాలగా ఏర్పాటు చేసి మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారన్నారు. ఇలాంటి మహత్కార్యాలను అన్ని చోట్ల ఏర్పాటుకు పెద్దలందరూ పూనుకోవాలన్నారు. 

జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ చారిత్రాత్మకమైన ప్రసిద్ధి చెందిన  గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి పశ్చిమ గోదావరి  నుంచి  నెల్లూరు వరకు ఐదు జిల్లాల నుంచి పేద రోగులు చికిత్స కోసం వస్తుంటారన్నారు. కరోనా సమయంలో పెద్ద ఎత్తున సూమారు 1600 మంది రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నారని, వారికి సహాయంగా వచ్చిన వారు భోజనం కోసం పడుతున్న ఇబ్బందులను గమనించినప్పుడు వచ్చిన ఆలోచనకు అనుగుణంగా మధురాన్నం సోసైటీ ద్వారా రోగుల సహాయకులకు ఉచిత భోజనం సదుపాయంకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఎపీఎన్జీవో సంఘం నిర్మించిన భవనంలో మధురాన్నం సోసైటీ ద్వారా ఉచిత భోజనసదుపాయం కల్పించటం జరిగిందన్నారు.  భోజనశాలలో ఒకేసారి 300 మంది కూర్చోని భోజనం చేసేలా, అన్ని రకాల కూరలు,  పెరుగుతో రోగుల సహాయకులకు  కడుపు నిండా భోజనం అందించటం జరుగుతుందన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి ఉన్నంత వరకు మా సోసైటీ ద్వారా ఉచిత భోజన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రోగుల సహాయకులతో పాటు ఆస్పత్రిలోని పారిశుద్ధ్య కార్మికులు, నాల్గవ తరగతి ఉద్యోగులకు ఉచితంగా  భోజనం అందిస్తామన్నారు. మంచి ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంను ఎన్జీవో సంఘంతో పాటు అందరి భాగస్వామ్యంతో ముందుకు తీసుకువెళుతామన్నారు.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర గృహనిర్మాణశాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ భోజనశాలలో రోగుల సహాయకులకు ఉచిత భోజనం టోకేన్లు పంపిణీ చేసి, భోజనంను స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా, మద్ధాళి గిరిధర్, కిలారి వెంకటరోశయ్య, నంబూరి శంకరరావు, మేరుగ నాగర్జున, బొల్లా బ్రహ్మనాయుడు, ఉండవల్లి శ్రీదేవి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నగరపాలక సంస్థ మేయరు కావటి శివనాగ మనోహర నాయుడు, అర్బన్ జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్,  సంయుక్త కలెక్టర్ (రెవెన్యూ, రైతుభరోసా) ఏఎస్దినేష్ కుమార్, ఏపీఎన్జీవో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షలు చంద్రశేఖరరెడ్డి, నూతనంగా ఎన్నికైన జనరల్ సెక్రటరీ కెవీ శివారెడ్డి, జిల్లా ఎపీఎన్జీవో అధ్యక్షులు రామిరెడ్డి, డీఎంహెచ్వో డా. యాస్మిన్, హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ప్రభావతి,  గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, రాష్ట్ర కృష్ణ బలిజ, పూసల సంక్షేమ మరియు అభివృద్ది కార్పొరేషన్ చైర్ పర్సన్ కోలా భవానీ మణికంఠ, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయరు వనమా బాల వజ్ర బాబు వైసీపీ నాయకులు మర్రిరాజశేఖర్, వెంకటరమణ, దేవినేని మల్లిఖార్జున రావు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.