హేట్సాఫ్ కలెక్టర్ జి.మురళీధరరెడ్డి..
Ens Balu
25
Kakinada
2021-07-24 15:09:24
తూర్పుగోదావరి జిల్లాకి చాలా మంది ఐఏఎస్ అధికారులు జిల్లా కలెక్టర్లుగా వచ్చారు.. రెండేళ్లపాటు పనిచేసి తిరిగి పదోన్నతులు, బదిలీలపై తిరిగి వెళ్లారు.. కానీ జిల్లా కలెక్టర్ జి.మురళీధరరెడ్డి మాత్రం ఈ జిల్లాలో 86 మంది గ్రామ సచివాలయ పోలీసులకు ఉద్యోగాలు పోకుండా మానవతా ద్రుక్పదంతో ఆలోచించి వారి జీవితాల్లోనూ, కుటుంబాల్లోనూ వెలుగులు నింపారు.. నిజంగా తూర్పుగోదావరి జిల్లాలో పనిచేసి జిల్లా కలెక్టర్లలోనే కాదు రాష్ట్రంలోనే ఇదొక చరిత్ర అనే చెప్పాలి. అంత మంచిగా మానవతా ద్రుక్పదంతో ఆలోచించే కలెక్టర్లు ఇలాంటి రోజుల్లో ఉంటారా అంటారు మీకూ విషయం తెలిస్తే.. అంతే కాదు ఆయన చేసిన సహాయానికి, ఆ మహిళలందరికీ ఉద్యోగాలు రావడానికి ఇచ్చిన ఆదేశాలు తెలిస్తే హేట్సాఫ్ కూడా చెబుతారు. ఆ మంచి కార్యక్రమంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్, www.enslive.net కూడా భాగమైన విషయాన్ని మీకు ఆయన జిల్లా నుంచి బదిలీ అవుతున్న సందర్భంగా జిల్లా వాసులకు, ఉద్యోగాలు పొందిన మహిళా పోలీసుల ఆనందాన్ని ఇక్కడ ప్రత్యేకంగా తెలియజేయబోతున్నాం. అది 2020 జనవరి 21 ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామసచివాలయ వ్యవస్థకు మహిళా పోలీసు ఉద్యోగులను ఎంపిక చేసే ప్రక్రియ. 3వ లిస్టు పెట్టి 86 మందికి మహిళలకు కాల్ లెటర్లు, ఫోన్లు చేశారు కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది. వారంతా 22వ తేది జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి వారి సర్టిఫికేట్ల వెరఫికేషన్ ప్రక్రియలో కూడా పాల్గొన్నారు. అక్కడ వారందరికీ నాన్ క్రీమీలేయర్ సర్టిఫికేట్లు లేవని చెబితే మళ్లీ వారి మండలాలకు వెళ్లి ఆగమేఘాలపై వెళ్లి ఆ సర్టిఫికేట్లను కూడా తెచ్చుకొని 23వ తేది సాయంత్రం 5 గంటలకు ఎన్నో ఇబ్బందులు పడి తెచ్చుకున్నారు. దానికి కారణం ఆ సర్టిఫికేట్ లేకపోతే మీకు ఉద్యోగం రాదనేది జిల్లా ఎస్పీ కార్యాలయ అధికారుల చేసిన హెచ్చిరకే కారణం. దీనితో ఉద్యోగానికి కావాల్సిన అన్ని ద్రువీకరణలు తెచ్చుకున్నారు ఉద్యోగార్ధులంతా. రెండు రోజుల పాటు సరిగా తిండి తినక ఉద్యోగం వస్తుందనే ఆనందంతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ ఈ నియామక ప్రక్రియలో పాల్గొన్నారు. అందరికి ఆయా సచివాలయాలను కేటాయిస్తూ జాబితా కూడా సిద్దం చేసేశారు. 23వ తేదీన వారందరికీ నియామక ఉత్తర్వులు ఇవ్వాలి.. అందరూ భోజనాలు చేసి వస్తే నియామక పత్రాలు ఇస్తామని చెబితే.. ఒక్క మహిళ కూడా ఎస్పీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లలేదు. తమకి ఉద్యోగాలు వచ్చాయని, నియామక పత్రాలతో ఆనందంగా ఇంటికి వెళదామని.. తమ వెంట వచ్చిన కుటుంబ సభ్యులతో కలిసి ఏ హోటల్లోనే భోజనం చేద్దామని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో.. సరిగ్గా సమయం 3 గంటలు అవుతున్న ప్రాంతంలో కార్యాలయం నుంచి ఒక సిఐ వచ్చి.. మీ అందరికీ బ్యాడ్ న్యూస్ మీకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు కేన్సిల్ అయ్యాయి.. మీరంతా ఇంటికి వెళ్లిపోవచ్చు అన్నారు. అంతే ఆ మాటలు విన్న మహిళలంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చేతి వరకూ వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం ఒక్కసారిగా దూరమైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఆ వేదన అనుభవించిన వారికే తెలుస్తుంది. పోలీసు అధికారులు ఉద్యోగాలు కేన్సిల్ అయిన విషయాన్ని ప్రకటించడంతో అక్కడ ఉద్యోగాలు వస్తాయనుకున్న వారంతా ఒకటే ఏడుపులు, ఆర్ధనాదాలు. వెంటనే వీరంతా తమనకు న్యాయం చేయాలంటూ పోలీసుల కోరితే.. అవేమీ పట్టించుకోని పోలీసు అధికారులు అప్పటి వరకూ ఎంతో మర్యాదగా చూసి అప్పటికప్పుడు వీరందరినీ బయటకు పంపి గేట్లు వేయాలని మరో అధికారి ఆదేశించారు.. అత్యధిక సంఖ్యలో మహిళా పోలీసులకు ఉద్యోగాలు కల్పిస్తున్న న్యూస్ ని కవర్ చేయడానికి రెండు రోజుల పాటు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ చీఫ్ రిపోర్టర్ పి.బాలభాను(బాలు) వ్యవహారం మొత్తం గమనిస్తున్నారు. అయితే ఒక్కసారి పోలీసులు ఈ విధంగా ప్రకటించడంతో ఏదో జరుగుతుందని అక్కడ జరుగుతున్న తంతుని, తాజా సమాచారాన్ని ఎప్పటి కప్పుడు తమ న్యూస్ ఏజెన్సీ ప్రధాన కార్యాయాలనికి లైవ్ గా ఒక పక్కగా అందిస్తూనే.. ఇక్కడ జరిగిన అన్యాయాన్ని కాకినాడతోపాటు, జిల్లాలోని అన్ని మీడియా సంస్థల రిపోర్టర్లకు విషయాన్ని, ఫోటోలను, వీడియోలను క్షణాల్లో చేరవేశారు. దానితో విషయం మొత్తం అన్ని టీవీ ఛానళ్లు, మొబైల్ న్యూస్ యాప్స్ లో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఉద్యోగాల కోసం ఎస్పీ కార్యాలయంలో వున్న మహిళందరికీ ఆందోళన చేస్తున్నారని పోలీసులు బయటకు నెట్టేశారు. దీనితో వెంటనే ఈఎన్ఎస్ చీఫ్ రిపోర్టర్ మహిళలందరికీ దైర్యం చెప్పి గ్రామసచివాలయ శాఖ పంచాయతీరాజ్ శాఖకు చెందినది కావడంతో వారిని జెడ్పీ సిఈఓ దగ్గరకు వెళితే న్యాయం జరుగుతుందని చెప్పారు. ఆ వెంటనే అక్కడి నుంచి మహిళలంతా బైకులు, ఆటోల్లో జెడ్పీ సిఈఓ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కూడా వారికి చుక్కెదురైంది.. జాబ్స్ కేన్సిల్ అయితే తాము ఏమీ చేయలేమని అక్కడ అధికారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేతులెత్తేశారు.. అంతేకాకుండా ఈ విషయాన్ని ఒకేసారి 86 మంది మహిళలు వచ్చి చెప్పడంపై కోపంతో ఊగిపోతూ ఇక్కడ కూడా సిబ్బందితో మహిళలందరికీ బయటకు పంపేశారు. అప్పటికే సమయం 5 అవుతుంది. కలెక్టర్ కార్యాలయంలో అధికారులంతా డ్యూటీ ముగించుకొని వెళ్లిపోయే సమయం. అది తలచుకుంటూ మహిళలందిరిలోనూ ఒక్కటే ఆందోళన.. అక్కడ జరిగిన అవమానాన్ని దిగమింగుతూ కంటతడి పెట్టుకుంటూ జెడ్పీ కార్యాలయం కిందికి దిగుతున్నారు.. మళ్లీ వారిని గమనించిన ఈఎన్ఎస్ ప్రతినిధి ఆ వెంటన ఇక్కడ మీకు పనిజరగదని మీరు నేరుగా జిల్లా కలెక్టర్ ద్రుష్టికి తీసుకెళితే ప్రయోజనం వుంటుందని చెప్పడంతో.. మళ్లీ అక్కడి నుంచి ఈ ఆశావాహులంతా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఏడుపులు, పెడబొబ్బలు, ఆందోళన చేసుకుంటూ పరుగులు తీశారు.. అప్పటికే ఈఎన్ఎస్ లైవ్ యాప్ న్యూస్ ద్వారా విషయం అధికారులు, ప్రజాప్రతినిధులకి తెలిసింది. ఆ వెంటనే కానినాడలో వున్న మీడియా మొత్తం కలెక్టరేట్ కి చేరుకుంది. అక్కడ ఆందోళనను బ్రేకింగ్ న్యూస్ ద్వారా అన్ని టీవీఛానళ్లలో ప్రసారం చేసింది.. పైగా కలెక్టరేట్ ఆవరణలోనే ఆందోళన జరుగుతుండటంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ జి.మురళీధరరెడ్డి కొంత మందిని తన చాంబర్ లోకి పిలిపించుకున్నారు. జరిగిన విషయం మొత్తం వారి ద్వారా సావధానంగా తెలుసుకున్నారు. అంతేకాదు జిల్లా పోలీస్ శాఖ చేసిన తప్పుని కూడా గుర్తించారు. ఈ నియమాకంలో ఉద్యోగాలు రాకపోతే సుమారు 45 మంది వయసు దాటిన మహిళలకు ఉద్యోగాలు రావు. మళ్లీ దగ్గర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా లేదు.. వారికి ఇక ఉద్యోగాలు రావు కారణం వారికి 43ఏళ్లు దాటిన వారే అధికంగా వున్నారు. దానితో అప్పటి కప్పుడే డిఎస్సీ చైర్మన్ హోదాలో వున్న జిల్లా కలెక్టర్ జి.మురళీధరరెడ్డి ముందు ఎంపిక చేసిన 86 మందికి ఉద్యోగాలు నియామక పత్రాలు ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఫోనులో ఆదేశించారు. మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలని, ఇంకా ఏమైనా పోస్టులు మిగిలితే తరువాత నోటిఫికేషన్ ద్వారా ఇవ్వాలని సూచించారు. కలెక్టర్ మహిళలందరి ఉద్యోగాల కోసం ఆలోచించిన తీరు, అటు మీడియాని కూడా ఎంతో ఆలోచింపజేసింది. కలెక్టర్ తీసుకున్న తక్షణ నిర్ణయంతో ఒకేసారి 86 మంది మహిళలకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులకు ఉద్యోగ నియామక పత్రాలు పొందడానికి మార్గం సుగమం అయ్యింది. అలాంటి నిర్ణయాలు తీసుకొని అంత మందికి ఒకేసారి ఉద్యోగాలు కల్పించడం తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక చరిత్ర, సంచలనం. ఒక జిల్లాకి ముఖ్య అధికారిగా వున్న జిల్లా కలెక్టర్, అందులోనూ మానవతా ద్రుక్పదంగా ఆలోచిస్తే ఫలితాలు ఏవిధంగా ఉంటాయో కలెక్టర్ జి.మురళీధరరెడ్డి ప్రత్యక్షంగా చేసి చూపించారు. అలా ప్రభుత్వ ఉద్యోగాలకి తామంతా దూరమైపోతున్నామనుకున్న వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన ఉన్నత దూరద్రుష్టి కలిగిన అధికారి ఆయన. అనంతరం తిరిగి జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆశావాహులకు రాత్రి 9గంటలకు ఉద్యోగ నియామక పత్రాలను జిల్లా పోలీసు కార్యాలయం అందజేసింది. జిల్లా కలెక్టర్ జి.మురళీధర రెడ్డి తమ జీవితాలను నిలబెట్టడంతో వారందరి ఆనందానికి హద్దులు లేవు. ఈ విషయం రాష్ట్రంలోనే చర్చనీయాంశమైంది. అంతేకాదు ఎందరో ఐఏఎస్ అధికారులకు కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఒక మార్గదర్శకమైంది. ఈ ఆనందాన్ని ఉద్యోగాలు వచ్చిన వారంతా థాంక్యూ కలెక్టర్ జి.మురళీధరరెడ్డి సర్, తేంక్యూ సిఎం వైఎస్.జగన్ సార్ అంటూ భారీ కేక్ కట్ చేసి ఆ రాత్రి సమయంలోనే తమ ఆనందాన్ని ఈఎన్ఎస్ ప్రతినిధితో పంచుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేసిన ఈ మంచి పనిలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.netచూపిన చొరవకు ఉద్యోగులంతా ధన్యవాదములు తెలియజేసినా..అవి కేవలం కలెక్టర్ మురళీధరరెడ్డి మాత్రమే దక్కాలంటూ చీఫ్ రిపోర్టర్ పి.బాలభాను(బాలు) అక్కడే మహిళా ఉద్యోగుల ముందే ప్రకటించారు. తరువాత అందరూ జనవరి 24వ తేదీన విధుల్లోకి చేరిపోయారు. ఈ విషయాన్ని ఆయా టీవీ ఛానళ్లలో న్యూస్ గా కవర్ చేసిన రిపోర్టర్లు కూడా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం 86 మంది కుటుంబాల్లో వెలుగులు నింపిందని హర్షం వ్యక్తం చేశారు. అంతటి మంచి కార్యక్రమంలో ఈఎన్ఎస్ భాగస్వామ్యం అయ్యిందని సగర్వంగా ప్రకటిస్తున్నాం.. అంతటి మంచి ఐఏఎస్ అధికారి కలెక్టర్ జి.మురళీధరరెడ్డి ఇక్కడి నుంచి పదోన్నతిపై బదిలీపై వెళుతున్న సందర్భంగా ఆయనకు మహిళా పోలీసులతోపాటు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కూడా హ్రుదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇదంతా ఎందుకు ఇపుడు మీకు తెలియజేశామంటే.. ఐఏఎస్ అధికారులు ప్రజలకు మేలు చేస్తే ఈ స్థాయిలో చేయాలని ఒక చిన్న సందేశం ఇవ్వడానికి మాత్రమే. హేట్సాఫ్ కలెక్టర్ మురళీధరరెడ్డి గారు..!