అనాధకు సీమంతం చేసిన డాక్టర్‘అమ్మ’..
Ens Balu
15
సత్తుపల్లి
2021-07-26 12:30:09
ఈరోజుల్లో వైద్యులంటే తినే సమయం గంట కేటాయిస్తే వేల రూపాయలు కోల్పోయి ప్రాక్టీసు పోతుందనే భావనతో ఆసుపత్రిలోనే గడుపుతున్నారు చాలా మంది వైద్యులు.. మరికొందరు కరోనాను బూచితో చేసే వైద్యానికి లేని ఖరీదు కడుతూ రెండు చేతులా సంపాదించడానికే సమయం వెచ్చిస్తారు..కానీ ఈ డాక్టరమ్మ మనసు నిజంగా బంగారం.. సమయం దొరికితే నా అనేవారు లేనివారికి తనవంతు సహాయం చేయాలనుకుంటారు.. విషయం తెలుసుకొని స్వయంగా వెళ్లి సాయం చేసి వస్తారు.. ఒక ప్రచారం.. మరో ఆర్బాటం.. అంతకు మించిన దేశాన్ని మొత్తం వీరే ఉద్దరించేస్తున్నట్టు చేసే హాడివిడీ.. ఏదో గొప్ప సంఘ సంస్కకర్తల్లా రూ.5 సహాయానికి రూ.500 బిల్డప్పులు ఏమీ ఉండవు.. కేవలం చేసిన సహాయాన్ని తలచుకోవడానికి.. ముందు ముందు మరిన్ని సహాయాలు చేయడానికి చేసిన సహాయానికి సంబంధించిన ఫోటోలతోనే ఆత్మ సంత్రప్తి పడతారు.. వాటిని ప్రేరణగా తీసుకొని మరిన్ని సహాయాలు చేస్తారు ఆమెపేరే డా..సుధ కొనకళ్ల.. పశ్చిమ గోదావరి జిల్లా సత్తుపల్లికి చెందిన ఈమె.. వ్రుత్తి రీత్యా ఆయుర్వేద వైద్యులు, మొక్కల ప్రేమికులు, అంతకంటే ముందు సమాజసేవకులు. తన సంపాదన మొత్తం కుటుంబానికే కాకుండా పేదలకు కొంత కేటాయించే నిండు మనసున్న డాక్టరమ్మ.. ఇక విషయానికొస్తే ఇటీవల ఇదే గ్రామానికి చెందిన చిన్నమ్మకు 19ఏళ్లకే పెళ్లైంది.. కడు నిరుపేద.. ప్రస్తుతం 7నెలల గర్భిణి.. ఈ అమ్మాయి తల్లి చిన్నప్పుడే చనిపోయింది. దీనితో ఆయనకు అన్నీ భర్తే.. అతను కష్టపడితేనే వీరిద్దరికి(కడుపులో బిడ్దతో కలిపి ముగ్గురికి) కడుపునిండుతుంది. కనీసం గూడు కూడా లేని ఈమే విషయం డాక్టర్ సుధ తెలుసుకున్నారు. వెంటనే మూడు రకాల మిఠాయిలు, రెండు రకాల పళ్లు, ఒక జత బట్టలు, పసుపు, కుంకుమ, తీసుకెళ్లి ఆ నిరుపేదకు ఇచ్చారు. తల్లిలేని లేని లోటును, తనకి సీమంతం జరిగుంటుంటే బాగుణ్ణు అనే కోరికను మంచి మనసుతో తీర్చిన నిండైన హ్రుదయమున్న డాక్టరమ్మ.. వాస్తవానికి నిరుపేదల దగ్గరకి వెళ్లడానికి, అదీ కనీసం ఇల్లు కూడా సరిగా లేనివారి దగ్గరకు వెళ్లడానికి ఈ రోజుల్లో ఎవరూ సాహసించరు. అలాంటిది ఆ చిన్నమ్మ పరిస్థితి తెలుసుకొని ఎలాగైనా తనవంతు సహాయం చేయాలని నిశ్చయించుకొని మరీ స్వయంగా వెళ్లి సీమంతం చేసి వచ్చారు డాక్టర్(అమ్మ). ఎప్పుడూ ప్రచారాని దూరంగా వుంటూ తనవంతు ఉచిత వైద్యసేవలు చేస్తూ..అంతకంటే ఎక్కువగా పేదలకు తనవంతు సహాయం చేస్తూ మంచి దాతగా గుర్తింపు పొందారు డాక్టర్ సుధ కొనకళ్ల. మనం చేయాలనుకుంటే ఎవరీని సంప్రదించకుండానే సహాయం చేయాలి.. నేను ఎన్నో సహాయాలు చేశారు.. కానీ ఈరోజు తల్లిదండ్రులు లేని ఈ నిండు గర్భిణికి చేసిన సీమంతం నా జీవితంలో గుర్తుండి పోతుందని ఆనందం వ్యక్తం చేశారీమె..అయితే ఇవన్నీ ఆమె చెబితే తెలుసుకున్నవి కాదు..నిత్యం ఆమె ఫేస్ బుక్ పోస్టింగ్లు చూస్తూ.. ఆమె సేవలు తెలుసుకుని ఈఎన్ఎస్ చీఫ్ రిపోర్టర్ బాలు అందించినదే ఈ మానవీయ కధనం.. దాతలంటే దారిచూపేవారు..దరి చేర్చుకునేవారు.. దాత్రుత్వం ప్రద్శించేవారు..వాటన్నంటికీ కేరాఫ్ అడ్రస్ డాక్టర్ సుధ కొనకళ్ల.. ఇలాంటి దాతలు మరింత మంది ముందుకొస్తే.. అంతకంటే మరింత మంది నిరుపేదలకు ఎన్నో సహాయాలు అందుతాయి.. ప్రార్ధించే పెదవుల కన్నా..సాయం చేసే చేతులు మిన్న..!