భక్తులకు సేవలో హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ..
                
                
                
                
                
                
                    
                    
                        
                             
                            
                                
Ens Balu
                                 21
                            
                         
                        
                            
Vijayawada
                            2021-10-09 11:01:57
                        
                     
                    
                 
                
                    శరన్నవరాత్రి ఉత్సవాల తొమ్మిది రోజులు ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు వృద్ధులకు ఉచిత వేడి పాలను పంపిణీ చేస్తున్నామని హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి యాసర్ల కోటేశ్వర రావు తెలిపారు. రోజుకు 500 లీటర్లకు పైగా పాలను క్యూలైన్లలోని భక్తులకు అందిస్తున్నామన్నారు. 2016 సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాల నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులలో ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు, వృద్ధులకు ఉచితంగా వేడి పాలను అందిస్తున్నామని ఆయన తెలిపారు. లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా ట్రస్ట్ సొంత నిధులతో అందిస్తున్నామని దాతలు ఎవరైనా స్వచ్ఛందంగా పాలను సమకూరిస్తే తీసుకుంటామని ఆయన అన్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు తమ ట్రస్టు ద్వారా అందించే ఉచిత వేడిపాలను తమ ట్రస్ట్ సభ్యులు అందిస్తున్నారని ఆయన అన్నారు. హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ స్థాపకులు చింతకాయల నాగ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ట్రస్ట్ లో జాయింట్ సెక్రటరీ దుర్గాభవాని, సభ్యులు ఆర్ వెంకటేశ్వరరావు చక్రధర్ గంగాధర్ జయరామ్ భక్తులకు సేవలు అందిస్తున్నారని తెలిపారు.