సాయం సంధ్యవేళ అలా చల్లగాలిలో కూర్చుకొని ఆ ఊసూ..ఈ ఊసూ ఆడుకుంటూ పకోడీలు తింటే అ మజానే వేరుగా వుంటుంది కదా..అదే ఆ పకోడీ చికెన్ పకోడీ అయితే ఆ వర్ణన మాటలకు అందదు. అలాంటి టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ చేసుకొని రుచి చూడాలని మీకూ వుందా..అయితే ఈఎన్ఎస్ లైవ్ యాప్ కిచెన్ రెసీపీస్ ద్వారా అందించే ఈ చికెన్ పకోడీ రెసిపీని చూసి మీరూ ఓ సారి ట్రైచేయండి. నోట్లో పెట్టగానే అలా కరిగిపోయి, ఎంతో కమ్మటి రుచిని అందించే చికెన్ పకోడీ తయారు చేయడం ఈ రోజు మీకు అందిస్తున్నాం. మేము చెప్పిన కొలతలతో చేస్తే పెర్ ఫెక్ట్ చికెన్ పకోడీ వచ్చి తీరుతుందంటే నమ్మండి. ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ స్టైల్ ఒకటికి రెండు సార్లు చదువుకొని ఒక్కసారి మీరు ట్రైచేస్తే..మీకే తెలిసిపోతుంది. చికెన్ పకోడీ ఎలా చేయాలో.. అంతకంటే ముందుగా మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటేంటే ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ని గుగూల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవడం మాత్రం మరిచిపోవద్దు. లెట్స్ స్టార్ట్ టేస్టీ టేస్టీ చికెన్ పకోడి. ఇక్కడ ఒక కేజీ చికెన్ పకోడీకి సరిపడే విధంగా మీకు తెలియజేస్తున్నాం. పకోడీ చేసే ముందు రెసిపీని యాప్ లో చూస్తూ చేస్తే పక్కాగా..ఎంతో టేస్టీ టేస్టీగా వచ్చేస్తుంది.
చికెన్ పకోడీకి కావాల్సిన మసాలాలు...
చికెన్ పకోడీకి కావాల్సినవి ఒక్కసారి చూసుకుంటే.. ఒక కేజీ చికెన్, ఆరు పచ్చిమిరపకాయలు పెద్దవి వాటిని పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకోవాలి, ఒక పెద్ద కట్ట కరివేపాకు, ఒక కప్పుడు కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, అర చెంచా పసుపు, రెండు చెంచాల కారం, ఒక చెంచా దనియాలపొడి, ఒక చెంచా జీలకర్రపొడి, ఒక చెంచా గరం మసాలా పొడి, మూడు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు కోడిగ్రుడ్లు, ఒక కప్పు కాన్ ఫ్లోర్, పావుకప్పు శనగపిండి(ఇది ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు), టేస్టింగ్ సాల్ట్(ఇది కూడా ఆప్షనల్ ఇష్టం వున్నవారు వేసుకోవచ్చు లేదంటే లేదు.. ఇది లేకపోయినా చాలా టేస్టీగా పకోడీ వస్తుంది) 150 గ్రాముల ఫ్రెష్ పెరుగు, ఒక చెంచా నెయ్యి, ఒక చెంచా చికెన్ మసాలా, కావాల్సి వుంటుంది.
చికెన్ పకోడీకి తయారీ విధానం..
ముందుగా మనం తీసుకున్న కేజీ చికెన్ ముక్కలకు చాక్ గానీ, ఫోర్కుతో గానీ గంట్లు పెట్టుకొని దానిని ఒక గంటపాటు ఉప్పునీటిలో నానబెట్టుకోవాలి. ఆత తరువాత ఉప్పునీటి నుంచి చికెన్ ను వేరుచేసి అందులో పేన తెలియజేసిన మసాలా సామాన్లు అన్నీ కలుపుకొని చికెన్ కు బాగా పట్టించాలి. ఆ తరువాత దానిని ఒక 3 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టి మేరినేట్ చేయాలి. మసాలాలు కలిపిన చికెన్ ఎంత ఎక్కువ సేపు నానితే చికెన్ పకోడీ అంతబాగా వస్తుందని గుర్తుంచుకోండి. తరువాత ఒక కడాయ్ తీసుకొని స్ట్ వ్ పై పెట్టుకొని నూనె బాగా మరిగిన తరువాత చికెన్ ను పకోడీ గా వేసుకోవాలి..అయితే ఇక్కడ అంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటేంటే పకోడీ నూనెలో వేగుతున్న సమయంలోనే పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు కలిపి వేపాలి. అప్పుడే చికెన్ పకోడీకి కాస్త స్పైసీ నెస్ వచ్చి కరివేపాకు అరోమా మొత్తం పడుతుంది. మనం తినే ప్రతీ చికెన్ ముక్కలోనూ ఆ టేస్టు తెలుస్తుంది. పకోడీలు బాగా వేగాయని తెలియగానే బయటకు తీసేయాలి..అదేలా తెలుస్తుందంటే నూనెలో వేగిటపుడు నురగ రావడం తగ్గిపోతుంది అంటే పకోడీలు బాగా వేగిపోయాయని అర్ధం. మరీ ఎక్కువ సేపు వేపేస్తే ముక్క గట్టిపడిపోతుందని మాత్రం తప్పక గుర్తుంచుకోవాలి. మొత్తం దించేసిన తరువాత టమాటా కచెప్, ఉల్లిపాయతో తింటే ఆహా అంటారు. నచ్చిందా ఈ రెసీపీ..మీరూ ఒక్కసారి ట్రైచేస్తారా.. మీదే ఆలస్యం.. మేము అందజేసిన ఈ రెసిపీ ఎలా వచ్చిందో ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో కామెంట్ రాయడం మాత్రం మరిచిపోకండి. ఆల్ ది బెస్ట్.