నోరూరించే పండు మిరపకాయ్ నిల్వ పచ్చడి..


Ens Balu
23
Visakhapatnam
2021-03-04 09:25:51

చాలా మంది ఇంట్లో అధిక మొత్తంలో మిరపకాయాలు తెచ్చిన సందర్భంలో అవి పండిపోయి ఎండిపోతుంటాయి..అలాంటి సందర్భంలో పండుమిరపకాయ్ లు పచ్చిగా ఉండి రంగు మారినపుడే పచ్చడి పెట్టుకుంటే వేడి వేడి టిఫిన్ లలోకి చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని చేసే విధానంలో మాత్రం ఒక పద్దతి పాటించాలి లేదంటే పచ్చడి చాలా త్వరగా పాడైపోతుంది. మేము చెప్పినట్టు పండు మిరపకాయల పచ్చడి మీరు ట్రై చేస్తే ఆరుచి అమోఘంగా వుంటుంది. చాలా మంది పచ్చిమిరపకాయలు పండిన తరువాతర ఈ పచ్చడిని తయారు చేస్తారు. అలాకాకుండా మిరప మొక్కకి కాయముదిరి పండిన మిరపకాయలు ఫ్రెష్ గా ఉన్నవి తెచ్చుకొని పచ్చడి చేసుకుంటే సాధారణ పండు మిరపకాయ్ పచ్చడికి, చెట్టుకి ముగ్గిన పండు మిరపకాయ్ పచ్చడికి రుచిలో చాలా తేడా వుంటుందని గమనించాలి.. పండు మిరపకాయ్ పచ్చడి తయారు చేసే విధానం తెలుసుకుంటే.. ముందుగా ఒక కేజి పండు మిరపకాయలు తీసుకోవాలి. దానికి ఉప్పు నూట యాభై గ్రాములు ఉప్పు, చింతపండు నూట యాభై గ్రాములు, ఒక స్పూన్ పసుపు, రెండు స్పూన్ల ఆవపిండి, రెండు స్పూన్ల మెంతిపిండి, 50 గ్రాముల బెల్లం, 300 గ్రాముల నువ్వుల నూనె, పోపుకోసం ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ పోపుకోసం సిద్దం చేసుకోవాలి.. ముందుగా మిరపకాయలను పైన పేర్కొన్న సామాన్లు అన్నీ వేసుకొని వాటిని కచ్చా పచ్చాగా దంచి ఒక రాత్రి ఉంచుకోవాలి. అపుడు ఆ మిశ్రమం మెత్తబడుతుంది. మరుసటి రోజు మరల ఈ దంచిన పచ్చడి మిక్సీ వేసి మనకు కావలసినంత మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీలో కాకుండా పెద్ద రుబ్బురోలుపై రుబ్బుకుంటే పచ్చడి మరింత టేస్టుగా వుంటుందని గమనించాలి అంతా. ముందుగా వేయించుకొని సిద్ధం చేసుకున్న రెండు స్పూన్ల ఆవపిండి మెంతిపిండి  అందులో వేసి కలపాలి. అదే సమయంలో ఫ్లేవర్ కాస్త బాగా రావాలనుకునేవారు వెల్లుల్లి కూడా ఒక వంద గ్రాములు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవచ్చు మేకు ఖచ్చితంగా వేస్తాము. తరువాత బెల్లం కూడా బాగా గుండలా తురుముకొని వేసుకోవాలి. అంతా పూర్తయిన తరువాత ముందుగా చెప్పిన పోపు దినుసులు వేసుకొని తాలింపు పెట్టుకుంటే పండు మిరపకాయ్ పచ్చడి రెడి. దీనిని పప్పులోకి, దోసెల్లోకి, రసంలోకి, పెరుగన్నంలోకి వాడుకోవచ్చు చాలా బావుంటుంది..ఈ పండుమిరపకాయ్ పచ్చడి విధానం మీకూ నచ్చితే మీరూ ట్రై చేయండి..ఆ కమ్మనైన రుచి ఆశ్వాదించండి.