మజ్జిగ మిరపకాయలు చాలా మందే చేస్తారు. కానీ వీటిని మేము చెప్పినట్టు ఒక క్రమ పద్దతిలో చేస్తే పెరుగన్నంలోకిగానీ, రసంలోకి గానీ, పప్పులోకిగానీ చాలా టేస్ట్ గా వుంటాయి. అలాంటి టేస్టీ మజ్జిన మిరపకాయలు ఏలా చేయాలో ఒక్కసారి తెలుసుకుందాం. ముందు ఒక కేజీ కారం లేని చిన్న మిరపకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి మధ్యలో చిన్న గాటు పెట్టుకోవాలి. ఆ తరువాత ఒక లీటరు పుల్లని పెరుగు బాగా చిలికి ఒక లీటరు నీరు పోసి, ఒక స్పూన్ పసుపు ఒక చారెడు అంటే మన చేతికి సరిపడా ఉప్పు తీసుకుని మజ్జిగ లో బాగా కలుపుకోవాలి. ఆపై గాట్లు పెట్టిన మిర్చిని అందులో వేసి రెండు రోజులు బాగా ఊరనివ్వాలి.. ప్రతీరోజూ మిరపకాయలకు కిందకీ పైకీ బాగా కలియ బెట్టాలి. ఈ మజ్జిగ మిరపకాయలకు వెన్నతీసేసిన పాలు తోడు పెట్టి పెరుగు చేయకూడదు. బాగా వెన్న అధికంగా వున్న పాలను కాస్త దగ్గరగా మరగబెట్టి దానిని పెరుగు చేసి, పుల్లబెట్టిన మజ్జిగలో వేసి బాగా ఊరబెడితేనే మజ్జిగ మిరపకాయలు టేస్గ్ బాగా బాస్తాయి.
దానికి చిన్న సాంకేతిక కారణం కూడా వుంటుది వెన్న బాగా వున్న మిరప కాయ గాట్లలోకి వెన్న వెళ్లి ఆ మిరపకాయ్ ఎండిన తరువాత చాలా రుచి పెరుగుతంది. అలా ఊరబెట్టిన మిరపకాయలను ఒక ప్లాస్టిక్ షీట్ మీద పలచగా ఎండలో ఆరబెట్టాలి. ఈ మిరపకాలను మరీ గట్టిగా పిండ కూడదు..మరల సాయంత్రం తీసి మజ్జిగలో పోయాలి ఇలా ఒక నాలగైదు రోజులు పోసి గలగల లాడేదాకా ఎండనిచ్చి ఒక డబ్బాలో పోసుకుని నిలవ ఉంచుకొవాలి. ఒక కేజి మిరపకాయలు ఎండిన తరువాత సుమారు పావుకేజి వరకూ వస్తాయ్ అవీ పెద్దవి అయితే లేదంటే 200 గ్రాములు మాత్రమే వస్తాయ్. మనకు కావలసినపుడు తీసుకుని నునెలో వేయించుకుని తింటే ఆరుచి చాలా బాగుంటుంది..