గంటలో 33 రకాల వంటలు..


Ens Balu
4
Visakhapatnam
2020-10-06 15:57:42

విశాఖలో ప‌దేళ్ల బాలిక వంట‌ల్లో చ‌రిత్ర సృష్టించింది.  నేవీ చిల్డ్ర‌న్ స్కూల్లో ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న సాన్వి ఎం. ప్రాజిత్ ఒక గంట వ్య‌వ‌ధిలో 33 ర‌కాల వంట‌కాలు చేసిన ఈ చిన్నారి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్‌స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌స్‌లో స్థానం సంపాదించింది. ఈ ఏడాది ఆగ‌స్టు 29న సాన్వి  కేవ‌లం గంట‌సేప‌ట్లో సాన్వి చేసిన వంట‌కాల జాబితాలో ఇడ్లీ, వాఫిల్‌, కార్న్ ఫ్రిట్ట‌ర్స్‌, మ‌ష్రూమ్ టిక్కా, ఊత‌ప్ప‌, ప‌న్నీర్ టిక్కా, ఎగ్ బుల్స్ ఐ, శాండ్ విచ్‌, పాప‌డ్‌, చాట్‌, ఫ్రైడ్ రైస్‌, చికెన్ రోట్స్‌, పాన్ కేక్‌, అప్పం, వంటివి అనేకం ఉన్నాయి.  ఈ ఫీట్ సాధించేనాటికి అధికారికంగా ఆమె వ‌య‌స్సు కేవ‌లం 10 ఏళ్ల‌, ఆరు నెల‌ల‌, 12 రోజులుగా న‌మోద‌య్యింది. విశాఖ‌లో విధులు నిర్వ‌హిస్తున్న‌ వింగ్ క‌మాండ‌ర్ ప్రాజిత్ బాబు,  మంజ్మా దంప‌తుల గారాల ప‌ట్టి సాన్వి. స్టార్ చెఫ్, రియాల్టీ కుక్క‌రీ షో ఫైన‌లిస్ట్ అయి‌న త‌ల్లి, మంజ్మా  నుంచి సొందిన స్ఫూర్తితోనే ఈ రికార్డు సాధించింది. చిన్న‌ప్ప‌ట్నుంచీ అమ్మ‌, అమ్మ‌మ్మ‌, తాత‌య్య‌ల‌తోపాటు కిచెన్‌లో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతూ,  వంట‌ల్లో ఉడ‌తా భ‌క్తి సాయప‌డ్డం అల‌వాటున్న సాన్వి 10 ఏళ్ల‌కే తాను గ‌డుగ్గాయిన‌ని రుజువు చేసుకుంది. ఇదివ‌ర‌కే ప‌లు వంట‌ల పోటీల్లో గెలుపొంది అమ్మ‌కు త‌గ్గ కూతురిగా తానేమిటో రుజువు చేసుకుంది.