ఒలింపియాడ్ ర్యాలీ విజయవంతం కావాలి


Ens Balu
12
Visakhapatnam
2022-07-13 11:49:01

విశాఖలో ఈ నెల 17న నిర్వహించబోవు చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టరు  కె.ఎస్.విశ్వనాధన్  అన్నారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో  ఆయన మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ థీమ్ లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఒలింపియాడ్ టార్చ్ ఇండియా లోని ఎంపిక చేసిన 75 నగరాలలో, 36 రాష్ట్రాలను కవర్ చేసి చివరగా చెన్నైకి చేరుకుంటుందని తెలిపారు.   అందులో భాగంగా 17 వ తేదీన సాయంత్రం 5.15 గంటలకు విశాఖపట్నం పోర్ట్ స్టేడియం వేదికగా జిల్లాలో ఒలింపియాడ్ టార్చ్ రిలేని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎఫ్ ఐ డి ఈ  ఆధ్వర్యంలో బెనియా 44 వ చెస్ టోర్నమెంట్ కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుందని, చెన్నై వేదికగా జూన్ 20 నుంచి జులై 27 వరకు టోర్నమెంట్  జరుగుతాయన్నారు. 
విశాఖలోని పోర్టు స్టేడియం నుంచి స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం వరకు జరగనున్న ర్యాలీలో 10 కార్స్  30 ద్విచక్ర వాహనాలు జాతీయ జెండాలతో స్థానిక విద్యా సంస్థల పీఈటీలు తమ విద్యార్థులతో సహా పాల్గొని స్వాగతం పలకాలని సంబంధిత అధికారులను  జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ర్యాలీ నిర్వహించే సమయంలో  ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.  అదే విదంగా  శానిటేషన్, మంచినీరు తదితర అంశాలపై  జి.వి.ఎం .సి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.  ఈ సమావేశంలో  డి.ఎం .అండ్.హెచ్.ఓ శ్రీమతి కె.విజయలక్మీ, సెట్విస్ సి.ఇ.ఓ., పి.నాగేశ్వరరావు, జిల్లా స్పోర్ట్స్ అధికారి ఎన్.సూర్యారావు,  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.