ఉత్కంఠపోరులో విజయం సాధించిన రాయలసీమ కింగ్స్


Ens Balu
47
Visakhapatnam
2023-08-26 17:09:54

ఆంధ్ర క్రికెట్ ఆధ్వర్యంలో వైజాగ్ లోని డా. వైయస్సార్ ఏసీఏ విడిసిఎ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ - 2  మ్యాచ్ శనివారం సాయంత్రం   జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో రాయలసీమ కింగ్స్- గోదావరి టైటాన్స్ జట్లు తలపడ్డాయి. రాయలసీమ జట్టు మూడు పరుగుల తేడాతో సెమీ ఫైనల్స్ లో విజయం సాధించి ఫైనల్స్ లో చోటు దక్కించుకుంది. తొలుత టాస్ గెలుచుకున్న గోదావరి టైటాన్స్ ఫీల్డింగ్ ఎన్నుకొని బరిలోకి దిగారు. దీంతో బ్యాటింగ్ తీసుకున్న రాయలసీమ కింగ్స్ జట్టు బ్యాట్స్ మ్యాన్లు 20  ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేశారు. ఓపెనర్ బ్యాట్స్ మ్యాన్ గా దిగిన కె. హెచ్. వీరారెడ్డి అధ్బుతమైన బ్యాటింగ్ చేశాడు. కేవలం 47 బంతుల్లో 8 సిక్స్ లు,7 ఫోర్ల తో 92 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు జరిగిన సీరీస్ లో 92 పరుగుల ఎక్కువ స్కోర్ చేసిన తొలి బ్యాట్స్ మ్యాన్ గా  కె. హెచ్. వీరా రెడ్డి రికార్డ్ చేసి 
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అదే విధంగా మిడిల్ ఆర్డర్ లో దిగిన టి. వంశీ కృష్ణ, కెప్టన్ జి.హెచ్. విహారి ఇద్దరు చెరో 43 పరుగులు చొప్పున 86 పరుగులు చేశారు. 

అలాగే బి. ఎస్ వినయ్ కుమార్ 4 బంతుల్లో 19 పరుగులు చేసి స్కోరును ముందుకి తీసుకెళ్ళాడు.దీంతో రాయలసీమ కింగ్స్ జట్టు 218 పరుగుల లక్ష్యాన్ని గోదావరి టైటాన్స్ జట్టు ముందు నిలిపారు.  బ్యాటింగ్ బరిలోకి దిగిన గోదావరి టైటాన్స్  బ్యాట్స్ మ్యాన్ లు 20ఓవర్లు లో 9 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి చివరి ప్రయత్నం వరకు పోరాడి కేవలం 3 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. గోదావరి టైటాన్స్ జట్టు లో కూడా ఓపెనర్ బ్యాట్స్ మ్యాన్ గా దిగిన బి. మునిష్ రెడ్డి 40 బంతుల్లోనే 5 సిక్స్ లు,12 ఫోర్లు తో 89 పరుగులు చేసి  రెండో హైయెస్ట్ స్కోర్ చేసిన బ్యాట్స్ మ్యాన్ గా రికార్డ్ నిలిపాడు. మిగతా వారంతా సమిష్టిగా రాణించక పోవడంతో విజయాన్ని కైవసం చేసుకోలేక 
పోయింది. సెమీ ఫైనల్స్ లో విజయం సాధించిన రాయలసీమ కింగ్స్ జట్టు ఆదివారం నాడు జరిగే ఫైనల్స్ లో కోస్టల్ రైడర్స్ జట్టు తో తలపడనుంది.