జిల్లాకు మరిన్ని బహుమతులను సాధించాలని ఆఢుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో విజయం సాధించిన ఖోఖో, కబడీ జట్లును జాయింట్ కలెక్టర్ ఎమ్.జాహ్నవి అభినం దించారు. మంగళవారం ఆమె ఛాంబర్ లో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎల్.వి. రమణ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన తుమ్మపాల-2 ఖొఖొజట్టు, రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానం పొందిన సాలపువానిపాలెం కబడ్డి జట్టు జాయింట్ కలెక్టరు ను కలిశారు. ఈ సందర్బగా జె.సి. మాట్లాడుతూ మరింత శిక్షణ తీసుకుని జాతీయ జట్టుకు ఎంపికవ్వాలని ప్రోత్సహించారు. డి.ఎల్.డి.వో. రమణ మాట్లాడుతూ డిశంబరు 26 తేదీ నుండి ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర పోటీలలో రాష్ట్ర స్థాయి ఫైనల్ లో మన జిల్లా జట్టు బాపట్ల జిల్లా జట్టుతో ఓటమి చెంది ద్వితీయ స్థానాన్ని పొంది రూ.3 లక్షల నగదు, పతకం, ధృవపత్రంతో పాటు ట్రోఫీని కైవసం చేసుకుందన్నారు. అలాగే జల్లా కబడీ జట్టు సెమీఫైనల్ లో చిత్తూరు జిల్లా పై గెలిచి రూ.లక్ష నగదు బహుమతి, పతకం, ధృవపత్రాలతో పాటు ట్రోఫీని సాధించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోచ్ పి.వి.నాగేశ్వరరావు, కబాడీ కోచ్, ఫిజికల్ డైరెక్టర్లు డి.ఎస్. శ్యాంప్రసాద్, సత్యవతి, ఖోఖో జట్టు కెప్టెన్ నవీన్, కబాడీ జట్టు కెప్టెన్ కె.త్రివేణి ఇతర క్రీడాకారులు పాల్గొన్నారు.