వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టీని.. రానున్న రోజుల్లో స్పోర్ట్స్ డెస్టినీగా రూపాంతం చెందడానికి ఉపకార్ వైజాగ్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నీలు ఎంత గానో దోహదం చేస్తాయని ప్రముఖ సినీ నటుడు కంచర్ల ఉపేంద్ర బాబు పేర్కొన్నారు. ఆఖరిరోజు మ్యాచ్ లను తిలకించి.. క్రీడాకా రులను ఉత్తే జపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉపేంద్రబాబు విజేతలకు నగదు బహుమతులను ప్రధానం చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసంతోపాటు, ఉత్తేజాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయన్నారు. యువత క్రీడల్లో రాణించ డానికి ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు తమవంతు పాత్ర పోషిస్తుందన్నారు. అందులో ముఖ్యంగా తన తండ్రి, ట్రస్ట్ చైర్మన్ యువతను వెన్నద న్నుగా నిలబడి ప్రోత్స హిస్తున్న తీరు ఎందరికో ఆదర్శమన్నారు.
ఇలాంటి క్రీడలు తరచుగా జరగడం వలన యువతో క్రీడా స్పూర్తి పెరుగుతుందన్నారు. విశాఖ వేదికగా జరిగిన ఈ క్రికెట్ టోర్నీకి రూ.5 లక్షలు ప్రైజ్ మరీ అందించడం మామూలు విషయం కాదన్నారు. విశాఖ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో.. నేషనల్ క్రికెట్ మ్యాచ్ లను తలపిస్తూ సాగిన టోర్నమెంట్ లో ఉపకార్ వైజాగ్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ విజేత పోలమాంబ ఎలెవెన్ జట్టు విజేతగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. గెలుపొందిన వారికి బాధ్యత పెగరుతుంది.. రన్నర్స్ గా నిలిచినవారికి మరింత కసి పెంచుకొని క్రీడాకారులు వచ్చే లీగ్ కి సన్నద్ధం కావాలని ఉత్సహా పూరిత ప్రసంగాన్ని చేశారు. అనంతరం విజేతగా నిలిచిన జట్టుకు రూ.5 లక్షలు, రన్నర్ జట్టుకు రూ. 3 లక్షలు, బెస్ట్ బ్యాట్సమన్, బెస్ట్ బౌలర్లకు కూడా బహుమతులు అందజేశారు.
కాగా 10 రోజుల నుంచి ఉత్సాహంగా సాగిన టోర్నీ తగరపువలస చిన్న మైదానంలో ఈ రోజు ఘనంగా ముగిసింది. బుధవారం జరిగిన వైజాగ్ వారియర్స్ పోలమాంబ ఎలేవేన్ జట్లు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పోలమాంబ ఎలెవెన్ జట్టు విజయం సాధించింది. కాగా వైజాగ్ వారి యర్స్ జట్టు రన్నర్ గా నిలిచింది. ఈ మొత్తం టోర్నీకి మెయిన్ స్పాన్సర్ గా ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత, ప్రముఖ సం ఘ సేవలకులు, కళాభోజ డా. కంచర్ల అచ్యుత రావు వ్యవహరించారు. విశాఖలో క్రీడలకు పెద్ద ఎత్తున అచ్యుతరావు ఆర్థిక సాయం చేస్తూ వస్తు న్నారు. యువత చెడు మార్గం పట్టకుండా సక్ర మార్గంలో పయనించేందుకు క్రీడలకు భారీ క్రీడలను నిర్వహిస్తూ.. వారిని క్రీడాకారులుగా తీర్చి దిద్డంలో కీలక భూమిక వహిస్తున్నారు. క్రీడాకారులకు చేయూనిస్తూ వారిని ప్రోత్స హితస్తున్నారు. ఈకార్యక్రమం లో ఉపకార్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్, నాగు, రాజు తదితరులు పాల్గొన్నారు.
-విశాఖను క్రీడా నగరంగా నిలబెట్టడమే ధ్యేయం
విశాఖను యువ క్రీడాకారుల నగరంగా నిలబెట్టడమే ధ్యేయంగా ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా క్రీడలు నిర్వహిస్తున్నట్టు ట్రస్టు అధినేత, ప్రముఖ సంఘ సేవలకులు, కళాభోజ డా. కంచర్ల అచ్యుత రావు పేర్కొన్నారు. బహుమతుల ప్రధానోత్సవం ముగిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ అందమైన నగరంగా ఇప్పటి వరకూ అందరికీ తెలుసునని.. జాతీయ స్థాయిని మరపించి జరుగుతున్న ఈ తరహా క్రికెట్ లీగ్ లు క్రమం తప్పకుండా ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల చూపు విశాఖ వైపు తిప్పేలా చేయాలన్నది తమ ఆకాంక్ష అన్నారు.
ట్రస్టు ద్వారా సేవా కార్యాక్రమాలు, కళా, సాంస్క్రుతికి కార్యక్రమాలే కాకుండా క్రీడలను కూడా ప్రోత్సహించి యువతను సన్మార్గంలో నడపించాలనే తపతో పెద్ద ఎత్తున ప్రైజ్ మనీని అందించి క్రీడలు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. తమ ట్రస్టుద్వారా చేపట్టే సేవా కార్యక్రమాలకు ఎవరూ మధ్యవర్తులు ఉండరనీ..నేరుగానే అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. జాతీయస్థాయి క్రికెట్ మ్యాచ్ లకు విశాఖ యువతను పెద్ద సంఖ్యలో అందించాలనే లక్ష్యంగా ఈ టోర్నీలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నట్టు డా.కంచర్ల పేర్కొన్నారు.