ఆంధ్రప్రదేశ్ జట్టుకి రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన 40వ జాతీయ జూనియర్ బాలబాలికల టెన్నికాయిట్ పోటీలలో ఆల్రౌండ్ ఛాంపియన్స్ లో ద్వితీయ స్థానం సాధించి. ఈ విజయం, రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చిన సందర్భంగా రాష్ట్ర టెన్నికాయిట్ కార్యదర్శి కేఎన్వీ సత్యనారాయణ క్రీడాకారులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ, జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో రాణించిన క్రీడాకారులు ఇదే ఉత్సాహంతో మరింతగా తర్ఫీదు పొంది ప్రథమ స్థానం సాధించే దిశగా తయారు కావాలన్నారు. క్రీడాకారుల అభివృద్ధి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. క్రీడాకారులు క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవడం ద్వారా ఏ తరహా పోటీల్లోనైనా గెలవడానికి అవకా శం ఏర్పడుతుందన్నారు. అదే విధంగా క్రీడల్లో రాణిస్తూ.. మంచి ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.