ఉపకార్ కప్-24 సీజన్ 2 మెగా క్రికెట్ ఆక్షన్స్ కి అనూహ్య స్పందన


Ens Balu
16
visakhapatnam
2024-09-17 15:41:28

ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 మెగా క్రికెట్ టోర్నమెంట్(ఐపీఎల్ రేంజ్)కి క్రీడా కారుల నుంచి అనూహ్య స్పందన లభిచింది. విశాఖలోని తూర్పు నియోజవకర్గంలో 24 ఫ్రాంచైజీలు 400మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి. మంగళవారం  విశాఖ లోని ఆరిలోవ తోటగరువు రాధాక్రిష్ణ కళ్యాణ మండపంలో జరిగిన ఆడిషన్స్ అండ్ ఆక్షన్స్ అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఆక్షన్స్ ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు ఆదేశాల మేరకు మేనేజర్ సుధీర్ అండ్ టీమ్ చేపట్టారు. ఈ సందర్భంగా ట్రస్ట్ మేనేజన్ మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు మొత్తం 880 మందికి పైగా క్రీడాకారులు రిజిస్ట్రేషన్లు చేసుకోగా.. ఫ్రాంచైజీలు మాత్రం 400 మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ క్రికెట్ టోర్నీకి అనుకున్నదానికంటే అనూహ్య రీతిలో స్పందన లభించిందన్నారు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఆక్షన్స్ కి సమయం కేటాయించడంతో రాత్రి 8.30 గంటల వరకూ ఆక్షన్స్ జరిగాయన్నారు. ప్రస్తుతం సెలక్ట్ అయిన టీమ్ లకు ఉపకార్ ట్రస్టు నుంచి క్రికెట్ కిట్లను, క్రీడాకారులందరకీ టీషర్లు అందజేస్తామన్నారు. అక్టోబరు 3 నుంచి ఆరిలోవ పినాకిల్ గ్రౌండ్ లో క్రికెట్ లీగ్ ప్రారంభం అవుతుందన్నారు. ఉపకార్ కప్-2024 సీజన్ 2 మెగా క్రికెట్ టోర్నీకి ముందుగా అన్ని ఏర్పాట్లు చేపట్టడానికి ట్రస్ట్ చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు అనుమతులు జారీచేశారన్నారు. స్నేహపూర్వక వాతవారణంలో ఉత్సాహంగా ఈ టోర్నమెంట్ ను నిర్వహించేందుకు నేటి నుంచి పనులు ప్రారంభిస్తున్నట్టు వివరించారు. 

-క్రికెట్ టోర్నీ విజేతలకు భారీ నగదు బహుమతులు
 ఈ సీజన్ లో కప్ గెలుచుకున్నవారికి మొదటి ఫ్రైజ్ క్రింద రూ.1.20లక్షలు, రెండవ ప్రైజ్ రూ.60వేలు, మూడవ ప్రైజ్ రూ. 30, వేలు అందిస్తారు. దానితోపాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ క్రింద  ఒకరికి రూ.10వేలు,  బెస్ట్ బ్యాట్స్ మెన్ కి రూ. 5వేలు,  బెస్ట్ బౌలర్ కి రూ.5వేలు, బెస్ట్ ఫీల్డర్ కి రూ.2వేలు అందజేస్తారన్నారు. కాగా మరిన్ని వివరాలకు రెహమాన్-9010024108,  నవీన్-8341250320, సుధీర్-8639247388, నాగు-9390548005 నెంబర్లలో  సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.