విశాఖ‌లో ఉత్సాహంగా ప్రారంభ‌మైన ఏపిఎల్ క్రికెట్ ఫీవ‌ర్‌


Ens Balu
33
Visakhapatnam
2023-08-16 13:46:12

వైజాగ్‌ లో మళ్లీ క్రికెట్ ఫీవర్ మొదలైంది.. ఇక‌ విశాఖ నగరమంతా డా.వైఎస్సార్ క్రికెట్ స్టేడియంకే పరిమితం కానుంది. విశాఖలో క్రికెట్ అభిమానులకి క్రికెట్ పండుగ‌గా ఏపీఎల్ సీజన్ - 2 బుధ వారం వైభవంగా ప్రారంభమైంది. సినీ హీరోయిన్ శ్రీలీల గౌరవ అతిథిగా హాజరై క్రీడాకారుల్లో ఉత్సా హాన్ని నింపారు. క్రికెట్ అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని చెప్పారు. అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి.శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ, యువతలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీయడం కోసం బిసిసిఐ సహకారంతో ఏపీఎల్ సీజన్-  2 నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏపీఎల్ నిర్వహణ వల్ల రాష్ట్రానికి చెందిన క్రికెటర్లు జాతీయ, అంత ర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం లభిస్తుందన్నారు. 27వ తేదీ వరకు టోర్నీజ‌రుగుతంద‌ని వివ‌రించారు. ఐటిశాఖ‌ మంత్రి గుడివా డ అమర్నాథ్ మాట్లాడుతూ, సీఎం  వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్రీడాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నారని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో అన్ని రకాల క్రీడల్లో గ్రామ స్థాయిలో ప్రతిభ ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. విడిసీ ఏ అధ్యక్షులు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ఏపీఎల్ ద్వారా  ఏసీఏ అధ్యక్షులు పి.శరత్ చంద్రారెడ్డి యువ క్రీడాకారులను ప్రపంచానికి తెలియచేసేందుకు అవకాశం కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో  జివిఎంసి మేయర్ జి. హరి వెంకట కుమారి,  ఏపీఎల్ గవెర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ మాంచు పెర్రర్, ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపీనాథ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రోహిత్ రెడ్డి, ట్రెజరర్ వెంకట చలం, సీఈవో వెంకట శివా రెడ్డి, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్లు మునిష్ సెహగల్, జి.వి.వి. గోపాల్ రాజు, ఎంపీ ఎం.వి.వి. సత్యనారాయణ, ఏమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ రావ్, కలెక్టర్ ఎ. మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.