ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ లోని డాక్టర్ వైయస్సార్ ఏసీఏ విడిసీఏ క్రికెట్ స్టేడియంలో శనివారం సాయంత్రం జరిగిన ఏపీఎల్ 2 మ్యాచ్ లో ఉత్తరాంధ్ర లయన్స్, కోస్టల్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. 7 వికెట్ల నష్టానికి ఉత్తరాంధ్ర లయన్స్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలత టాస్ గెలుచుకున్న కోస్టల్ రైడర్స్ బ్యాటింగ్ ఎన్నుకొని బరిలోకి దిగారు. బ్యాటింగ్ తీసుకున్న కోస్టల్ రైడర్స్ బ్యాట్స్ మ్యాన్లు 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 160 పరుగులు సాధించారు. ఓపెనర్ గా దిగిన బ్యాట్స్ మ్యాన్ లు నిరుత్సాహ పరిచినా మిడిల్ ఆర్డర్ లో దిగిన ప్లేయర్స్ ఎం. హర్షవర్ధన్ 37 బంతుల్లో 2 సిక్సులు, 3ఫోర్లు తో 44 పరుగులు చేశాడు. జి. చిరంజీవి 23 బంతుల్లో 2 సిక్స్ లు, 3ఫోర్లు తో 38 పరుగులు చేసి నాట్ అవుట్ గా చివరివరకు నిలిచాడు. వీరిద్దరి పార్టనర్షిప్ లో 60బంతుల్లో 82 పరుగులు చేశారు. కెప్టన్ తో సహా మిగతా వారంతా అంతగా రానించలేక పోయారు.దీంతో 160 పరుగులు టార్గెట్ ను ముందు నిలిపారు. ఉత్తరాంధ్ర లయన్స్ బౌలర్లు సమిష్టిగా రాణించి 7 వికెట్లను తీసి స్కోరును అదుపు చేశారు.
బ్యాటింగ్ బరిలోకి దిగిన ఉత్తరాంధ్ర లయన్స్ క్రీడాకారులు 161 పరుగులు టార్గెట్ ను గడిచిన 17.3 ఓవర్లకే 7 వికెట్లు నష్టపోయి 166 పరుగులు చేసి ఘన విజయా
న్ని సొంతం చేసుకున్నారు. ఓపెనర్లు గా దిగిన కె. యస్. భరత్ 22 బంతుల్లో 4సిక్స్ లు, 6ఫోర్లు తో 54 పరుగులతో అర్థ సెంచరీ పూర్తి చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే సలేహ్ గుల్ఫామ్ 19 బంతుల్లో 2 సిక్స్ లు, 4ఫోర్లు తో 31 పరుగులతో చెలరేగిపోయా రు. వీరిద్దరి పార్టనర్షిప్ లో కేవలం 41బంతుల్లో 85 పరుగులు చేసి లక్ష్యం లో సగం స్కోరును వీరే చేదించారు. తరువాత దిగిన మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ అందరూ సమిష్టిగా రాణించి కొద్ది పాటి పరుగులు చేస్తూ 17.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టపోయి టార్గెట్ ను పూర్తి చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్తరాంధ్ర లయన్స్ టీమ్ కెప్టెన్ కె.యస్. భరత్ అధ్బుతమైన అర్థ సెంచరీతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
తమ్ముడిని ఔట్ చేసిన అన్న..
జి.చిరంజీవి కోస్టల్ రైడర్స్ తరపున ఆడుతుండగా ఇతని తమ్ముడు జి. శ్యామ్ సుందర్ ఉత్తరాంధ్ర లయన్స్ తరపున ఆడుతున్నాడు. 15.6వ ఓవర్‌లో శ్యామ్‌కు దీపక్ బౌలింగ్ వేశాడు. ఆ బాల్‌ను కొట్టి శ్యామ్ పరుగు ప్రారంభించగా అతని అన్న చిరంజీవి బాల్‌ను అందుకొని డైరెక్టుగా వికెట్లకు విసిరాడు. దీంతో అన్న చేతిలో తమ్ముడు రన్ ఔట్ అయ్యాడు.