ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ లోని డాక్టర్ వైయస్సార్ ఏసీఏ విడిసీఏ క్రికెట్ స్టేడియంలో బుధవారం ఉదయం జరిగిన ఏపీఎల్ సీజన్ - 2 లీగ్ మ్యాచ్ లో
యలసీమ కింగ్స్ , కోస్టల్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. వర్షం కారణంగా డాక్ వర్త్ లూయిస్ ప్రకారం రెండు వికెట్ల నష్టానికి కోస్టల్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. తొలత టాస్ గెలుచుకున్న కోస్టల్ రైడర్స్ ఫీల్డింగ్ ఎన్నుకొని బరిలోకి దిగారు. వర్షం కారణంగా మ్యాచ్ ను 18 ఒవర్లకు కుదించారు. దీంతో బ్యాటింగ్ తీసుకున్న రాయలసీమ కింగ్స్ జట్టు బ్యాట్స్ మ్యాన్లు 18 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 131 మాత్రమే చేయగలిగారు. కె హెచ్. వీరా రెడ్డి మాత్రమే 78 పరుగులు చేసి రాయలసీమ కింగ్స్ జట్టు లో స్కోరును ముందుకి తీసుకెళ్ళాడు. మిగతా వారంతా సమష్టిగా రాణించలేక పోయారు.దీంతో 131 పరుగుల టార్గెట్ ను కోస్టల్ రైడర్స్ జట్టు ముందు నిలిపారు.
బ్యాటింగ్ బరిలోకి దిగిన కోస్టల్ రైడర్స్ కి 15 ఒవర్లలో 127 పరుగులకు కుదించడం తో బ్యాట్స్ మ్యాన్ లు గడిచిన 14 ఓవర్లు లో రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ బ్యాట్స్ మ్యాన్ ఎం. ప్రణీత్ 40 బంతుల్లో 3సిక్స్ లు, 6ఫోర్లు తో 64 పరుగులు చేసి నాట్ అవుట్ గా చివరివరకు నిలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.