ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ లోని ఏసిఏ విడిసిఏ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ - 2 మ్యాచ్ శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఎలిమినేటర్ లెవల్ లో గోదావరి టైటాన్స్ విజయం సాధించి సెమీ ఫైనల్స్ లో చోటు దక్కించుకుంది. తొలత టాస్ గెలుచుకున్న గోదావరి టైటాన్స్ ఫీల్డింగ్ ఎన్నుకొని బరిలోకి దిగారు. దీంతో బ్యాటింగ్ తీసుకున్న ఉత్తరాంధ్ర లయన్స్ జట్టు బ్యాట్స్ మ్యాన్లు 19.5 ఓవర్లలో గోదావరి టైటాన్స్ బౌలర్ల చేతిలో ఆలౌట్ అయిపోయారు.153 పరుగుల టార్గెట్ ను గోదావరి టైటాన్స్ జట్టు ముందు నిలిపారు. గోదావరి టైటాన్స్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ తో ఉత్తరాంధ్ర లయన్స్ స్పీడ్ కు బ్రేకులు వేశారు. గోదావరి టైటాన్స్ జట్టు బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో 153 పరుగులకే ఉత్తరాంధ్ర లయన్స్ జట్టుని ఆల్ అవుట్ చేసి మట్టి కరిపించారు. బ్యాటింగ్ బరిలోకి దిగిన గోదావరి టైటాన్స్ బ్యాట్స్ మ్యాన్ లు గడిచిన 18 ఓవర్లు లో 159 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుని సెమీఫైనల్స్ కి స్థానం సాధించుకుంది. ఓపెనర్ బ్యాట్స్మెన్ గా దిగిన కెప్టెన్ సి. ఆర్. జ్ఞానేశ్వర్ 40 బంతులలో మూడు సిక్స్ లు, రెండు ఫోర్లు తో 53 పరుగులు చేసి అర్థ సెంచరీ పూర్తి చేసి నాటౌట్ గా నిలిచాడు. అదే విధంగా మూడో స్థానంలో దిగిన హేమంత్ రెడ్డి 53 బంతులలో మూడు సిక్స్ లు,7 ఫోర్లు తో 71 పరుగులు చేసి అర్థ సెంచరీ పూర్తి చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. వీరిద్ధరి పార్టనర్ షిప్ లో 93 బంతుల్లో 124 పరుగులు చేసి అద్భుతమైన బ్యాటింగ్ చేసి జట్టు విజయం కోసం కృషి చేశారు.