క్రీడా జిల్లాగా శ్రీకాకుళానికి పేరుతేవాలి..


Ens Balu
1
Srikakulam
2021-02-23 15:16:48

ఫెన్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాష్ట్ర,జాతీయ స్థాయిలో కూడా రాణించి శ్రీకాకుళం పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పిలుపునిచ్చారు.  మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి అండర్‌-14,జూనియర్ ,సీనియర్ విభాగాల్లోని  ఫెన్సింగ్ పోటీలు, రాష్ట్ర స్థాయి ఎంపికలను ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  క్రీడల్లో గెలుపోటముల సహజమని అన్నారు. క్రీడా స్పూర్తితో  క్రీడాకారులు రాణించాలన్నారు. శిక్షకులు ఇచ్చే సూచనలు,సలహాలను పరిగణలోకి తీసుకుని పోటీల్లో ప్రతిభాపాఠవాలను ప్రదర్శించారు.ఫెన్సింగ్ క్రీడలో కూడా జిల్లా పేరుప్రతిష్టలను  ఇనుమడింపజేసేలా క్రీడాకారులు తమ ప్రతిభ పాఠవాలను ప్రదర్శించాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తైక్వాండో,ఫెన్సింగ్ వంటి క్రీడా పోటీలను విరివిగా నిర్వహిస్తూ వాటిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న శ్రీను అభినందనీయుడన్నారు. భవిష్యత్ లో కూడా పోటీల నిర్వహణకు తమ వంతు సహాయసహకారాలను అందిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కళింగ వైశ్య  కార్పొరేషన్  చైర్మన్ అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ   శ్రీకాకుళం జిల్లాలో క్రీడాకారులకి  కొదవలేదున్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన టీంకి రాష్ట్ర స్థాయిలో పోటీలో పాల్గొనేందుకు గాను రూ.10వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లుగా తెలిపారు. జిల్లాస్థాయి ఎంపికల్లో ఎంపికైన క్రీడాకారులు జిల్లాస్థాయి ఎంపికల్లో ఎంపికైన క్రీడాకారులు, ఈనెల  27,28,మార్చి 1,2వ తేదిల్లో కాకినాడలో జరుగనున్న రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. ఈ ఎంపికలకు న్యాయనిర్ణేతగా ఎన్ ఐ ఎస్ కోచ్ జోగిపాటి వంశీ ,జ్యూరీగా డి.భవానీ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనుతో పాటు సంఘ సభ్యులు నానాజీ సిల్స్క రాజా,గిడుతూరి వెంకటేశ్వరరావు,బెవర జ్యోతిప్రసాద్ ,నాయుడు ,సహార కృష్ణ,సుధీర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.